Begin typing your search above and press return to search.

బాల‌య్య హిందీ.. త‌మిళంలో డైలాగ్స్ చెబితే..?

By:  Tupaki Desk   |   10 April 2017 6:55 PM IST
బాల‌య్య హిందీ.. త‌మిళంలో డైలాగ్స్ చెబితే..?
X
నంద‌మూరి న‌ట వంశానికి ఎన్టీఆర్ త‌ర్వాత‌.. ఆయ‌న వార‌సుడిగా నిలిచారు బాల‌కృష్ణ‌. తెలుగు మీద ప‌ట్టున్న ఆయ‌న‌.. మాట్లాడేట‌ప్పుడు త‌డ‌బ‌డ‌తారు కానీ.. డైలాగ్ లోకి వెళితే మాత్రం చించిపారేస్తారు. అర‌పేజీ డైలాగ్ సైతం అల‌వోక‌గా చెప్పేసే చాతుర్యం ఆయ‌న సొంతం. డైలాగ్స్ చెప్పే విష‌యంలో బాల‌య్య‌కున్న నేర్పు ఇప్ప‌టికే చాలా ఫంక్ష‌న్ల‌లో ఆయ‌న చెప్పేయ‌టం తెలిసిందే. కులాల మీద ఆయ‌న చెప్పిన డైలాగ్ కానీ.. మ‌హాభార‌తం..రామాయ‌ణంలో వంశ‌వృక్షం గురించి త‌డుముకోకుండా చెప్పే బాల‌య్య‌.. తాజాగా హిందీలోనూ.. త‌మిళంలోనూ డైలాగులు చెప్పేసి ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు.

ఈ ఆస‌క్తిక‌ర వైనం ఇటీవ‌ల నిర్వ‌హించిన టీఎస్సార్.. టీవీ9 నేష‌న‌ల్ ఫిలిం అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో చోటుచేసుకుంది. ఉత్తమ క‌థానాయ‌కుడి కేట‌గిరిలో లెజెండ్ చిత్రంలో పోషించిన పాత్ర‌కు అవార్డును సొంతం చేసుకున్నారు బాల‌కృష్ణ‌. ఈ అవార్డును అందుకోవ‌టానికి వెళ్లిన సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. బాలీవుడ్ ప్ర‌ముఖులు రిషీక‌పూర్ మొద‌లు.. త‌మిళ హీరో ప్ర‌భు ఎక్క‌డా అంటూ ఆరా తీశారు.

రిషిక‌పూర్ ఎక్క‌డా? అంటూ ఆరా తీసిన క్ర‌మంలో ఆయ‌న తాత పృద్వీరాజ్ క‌పూర్ ను ప్ర‌స్తావిస్తూ.. హిందీలో ఒక భారీ డైలాగ్ చెప్పేసిన బాల‌కృష్ణ‌.. ప్ర‌భు ఎక్క‌డ ఉన్నాడంటూ అడుగుతూ.. ప్ర‌భు తండ్రి శివాజీనితాను చిన్నాన్న అని పిలిచే వాడిన‌ని.. ఎంజీఆర్‌ను పెద‌నాన్న అని పిలిచేవాడిన‌ని.. నాటి ముచ్చ‌ట్లు చెబుతూ.. అల‌వోక‌గా త‌మిళంలో ఒక డైలాగ్ చెప్పేయ‌టంతో.. అక్క‌డే ఉన్న నాటి హీరోయిన్ మీనా ఉత్సాహంగా స్పందించ‌టం క‌నిపించింది.

ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నాను ప్ర‌త్యేకంగా పొగిడేసిన బాల‌కృష్ణ‌.. ప‌నిలో ప‌నిగా శిల్పాశెట్టి.. చార్మి..శ్రియల‌ను ప్ర‌స్తావిస్తూ.. వారినిపొగిడారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచిచిత్రాల‌కు అభిమానించి..ఆద‌రించే మ‌న‌సు ఉంద‌ని.. మంచి సినిమాలు చేసిన‌ప్పుడు వాటిని ఆద‌రిస్తే.. మ‌రో మంచి సినిమా తీయ‌టానికి ఉత్సాహం వ‌స్తుంద‌న్నారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. బాల‌య్య నోటి నుంచి హిందీ.. త‌మిళంలో చెప్పిన డైలాగులు ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారి చేత విజిల్స్ వేయించాయ‌న‌టంలో సందేహం లేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/