Begin typing your search above and press return to search.

బాల‌య్య సైరా ఫంక్ష‌న్ కి రాలేదా?

By:  Tupaki Desk   |   11 Oct 2019 10:55 AM IST
బాల‌య్య సైరా ఫంక్ష‌న్ కి రాలేదా?
X
మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు అద్భుత‌మైన స్క్రీన్ ప్లేలు రాస్తుంటారు. అక్క‌డ అలా జ‌రిగి ఉంటే..! ఎలా ఉంటుంది? అన్న థీమ్ ని ఎంచుకుని ఒక సీన్.. ఒక‌వేళ అక్క‌డ అలా కాకుండా ఇలా జ‌రిగి ఉంటే.. అంటూ వేరొక సీను.. ఇంకోర‌కంగాను జ‌రిగేందుకు ఆస్కారం ఉంటే.. అంటూ ఆ మూడో కోణం ఎలా ఉంటుందో చూపించే సీను..! ఇలా ఎన్న‌యినా ప్ర‌యోగాలు చేయ‌గ‌ల‌రు. ఒక ర‌కంగా ఇవ‌న్నీ క‌లిపితే `సాహో` స్క్రీన్ ప్లేలా ఉంటుంది.

అయితే అచ్చం అలానే జ‌రిగింది పార్క్ హ‌య‌త్ లో. అక్క‌డ జ‌రిగింది ఒక‌టి. జ‌ర్న‌లిస్టులు ఊహించింది ఇంకొక‌టి. రాసింది వేరొక‌టి. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ఆ ఈవెంట్ కి అస‌లు జ‌ర్న‌లిస్టులు ఎవ‌రినీ ఆహ్వానించ‌క‌పోవ‌డ‌మే. అస‌లింత‌కీ ఏం జ‌రిగింది? అంటే.. బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో టీఎస్సార్ సార‌థ్యంలో సైరా స‌క్సెస్ వేడుక ప్ర‌యివేటుగా కొద్ది మంది అతిధుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ వేడుక‌కు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- విక్ట‌రీ వెంక‌టేష్ విచ్చేసి మెగాస్టార్ కి శుభాకాంక్ష‌లు తెలిపార‌ని ప్ర‌చార‌మైంది. ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో రివీల్ కావ‌డంతో.. మెగా-నంద‌మూరి హీరోల‌ మ‌ధ్య వైష‌మ్యాలు తొల‌గిపోయ‌య‌ని అందుకే బాల‌య్య `సైరా` స్టార్ ని విష్ చేశార‌ని మాట్లాడుకున్నారు. క‌ట్ చేస్తే అస‌లు అక్క‌డ ఆ సీనే జ‌ర‌గ‌లేదు. అదంతా జ‌స్ట్ ఇమాజినేష‌న్.

అయితే ఆ సీన్ జ‌ర‌గ‌లేదా అక్క‌డ‌? అస‌లు చిరు-బాల‌య్య క‌ల‌వ‌లేదా? అంటే అది కూడా అస‌త్యం. ఆ ఇద్ద‌రూ అక్క‌డ క‌లిశారు. ఆ సీన్ వాస్త‌వం. ఆ దృశ్యం అదే పార్క్ హ‌య‌త్ నుంచే బ‌య‌టికి వ‌చ్చింది. అయితే చిరు బాల‌య్య క‌లుసుకున్న సీన్ మాత్రం వేరొక‌చోట. అదే భ‌వంతిలో నాలుగో ఫ్లోర్ లో వేరొక ద‌ర్శ‌కుడి ఫ్యామిలీ ఫంక్ష‌న్ జ‌రిగిందిట‌. ఆ ఫంక్ష‌న్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాల‌య్య- వెంక‌టేష్ పాల్గొన్నారు. అయితే చిరు ప‌క్క‌నే బాల‌య్య కూచుని ఉన్న ఫోటో ఒక‌టి ఆ వేడుక నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో అదే రోజు అదే హోట‌ల్లో జ‌రిగిన సైరా కార్య‌క్ర‌మానికే బాల‌య్య విచ్చేశార‌ని అంతా భావించారు. అయితే అక్క‌డ జ‌రిగిన రెండు సీన్లు వేర్వేరు. ఈ క‌న్ఫ్యూజ‌న్ తోనే అంతా ఏదేదో రాసేశారు. మొత్తానికి మ‌న స్క్రీన్ ప్లే రైట‌ర్లు ఎవ‌రూ క్లాసులు చెప్పాల్సిన ప‌నే లేకుండా ఆ సీన్ ని ఎలా రాయాలో జ‌ర్న‌లిస్టులు కూడా నేర్చేసుకున్నార‌న్న‌మాట‌! అయినా సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్ లో ఇలాంటి టిప్స్ ఎన్నో రాశారులే. ఈ మొత్తం ఎపిసోడ్ లో క‌ళాబంధు టీఎస్సార్ నార‌ద మ‌హ‌ర్షి పాత్ర‌ను పోషించారు.