Begin typing your search above and press return to search.

బాలయ్యతో బోయపాటి @ మిషన్ 70

By:  Tupaki Desk   |   25 Sep 2018 5:59 AM GMT
బాలయ్యతో బోయపాటి @ మిషన్ 70
X
నందమూరి బాలకృష్ణ ట్రాక్ రికార్డు చాలా బ్యాడ్ గా ఉన్న సమయంలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడిగా బోయపాటి శీను అంటే హీరోకే కాదు అతని అభిమానులకు కూడా ప్రత్యేకమైన అభిమానం. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహ-లెజెండ్ లు ఒకదాన్ని మించి ఒకటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడంతో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృతలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దిశగా అడుగులు పడుతున్నాయట.

ప్రస్తుతం రామ్ చరణ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బోయపాటి అది డిసెంబర్ కంతా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. మరో వైపు ఎన్టీఆర్ బయోపిక్ నటనతో పాటు నిర్మాణంలో సైతం యమా బిజీగా ఉన్న బాలయ్య ఆ టైంకే తను కూడా ఫ్రీ అవుతాడు. అప్పుడు ఈ కాంబోలో మూడో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టేలా చర్చలు జరుగుతున్నాయట. కానీ భారీ బడ్జెట్ తో తన సినిమాలు తెరకెక్కించే బోయపాటి గతంలో ఏ సినిమానూ వేగంగా తీసిన దాఖలాలు లేవు. కానీ బాలకృష్ణ మాత్రం అలా కాదని డెడ్ లైన్ పెట్టాడని ఫిలిం నగర్ టాక్.

దాని ప్రకారం కేవలం 70 రోజుల కాల్ షీట్స్ లో సినిమాను పూర్తి చేయాలనీ ఫిబ్రవరి నుంచే ఎన్నికల ప్రచారంలో బిజీగా మారాల్సి ఉంటుంది కాబట్టి ఆలోపే షూటింగ్ ఫినిష్ కావాలని చెప్పాడట. నిజానికి ఇది అంత సులభం కాదు. డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి బాలయ్య బోయపాటిలు ఇద్దరూ ఫ్రీ అయినప్పటికీ ఒకే సమయంలో క్లాష్ అవుతున్న రాంచరణ్ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ల కోసం ఎంత లేదన్నా ఇంకో పది పదిహేను రోజులు కేటాయించాల్సి వస్తుంది.

అలాంటప్పుడు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా లెక్కేసుకుంటే 70 పని దినాలు దొరకడం కష్టం. అందుకే అజర్ బైజన్ నుంచి తిరిగి రాగానే బోయపాటి బాలయ్యతో ఇదే డిస్కస్ చేయబోతున్నట్టు టాక్. పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఆ డెడ్ లైన్ మీట్ కావడం కష్టం కనక 70 రోజులకు బదులు మరో ప్రతిపాదన అడిగే అవకాశం ఉందట. ఏది ఎలా ఉన్నా ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం బోయపాటితో జట్టు కట్టడానికి బాలయ్య అయితే రెడీగా ఉన్నాడన్న మాట.