Begin typing your search above and press return to search.

బాలయ్య తిట్టింది జూ.ఎన్టీఆర్‌నే???

By:  Tupaki Desk   |   10 April 2015 5:00 PM IST
బాలయ్య తిట్టింది జూ.ఎన్టీఆర్‌నే???
X
ఇకపోతే అసలు ''లయన్‌'' సినిమా ఆడియో రిలీజ్‌ అయ్యింది అనే దానికంటే ఇప్పుడు అత్యంత పెద్ద డిస్కషన్‌ జరుగుతోంది మాత్రం నందమూరి ఫ్యామిలీలోని వివాదాల గురించే. ''బాలకృష్ణతో పెట్టుకుంటే ఎవరైనా అంతే.. చిట్టెలుకలూ, చిరతు పులులూ.. మనతో పెట్టుకుంటే మాడి మసైపోతాయ్‌'' అంటూ గంభీరమైన టోన్‌లో పబ్లిక్‌గా వేలమంది అభిమానుల సమక్షంలో బాలయ్య అనేశాడు. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరిని? బాలయ్యతో పెట్టుకున్న ఆ చిరుత పులి ఎవరు?

కట్‌ చేస్తే.. ఇదంతా జూ.ఎన్టీఆర్‌ గురించే అని స్వయంగా నందమూరి ఫ్యాన్సే ఫేస్‌బుక్కుల్లో, ట్విట్టర్లలో ఇప్పుడు చర్చ చేస్తున్నారు. అసలు బాలయ్యకూ, జూనియర్‌కు ఎందుకు చెడిందో తెలియదు కాని.. జూనియర్‌ మాత్రం గత సంవత్సరం ఎలక్షన్స్‌ టైమ్‌లో భారీగా హ్యాండిచ్చాడు. నన్ను ఇన్‌వైట్‌ చేస్తేనే వస్తాను అంటూ జూనియర్‌ మొండికేయడంతో.. బాలయ్యకూ, చంద్రబాబుకూ ఇంకా కాలిపోయింది. ''ఎవ్వరినీ బొట్టు పిట్టు పిలువం. ఎవరికి ఆసక్తి వుంటే వారే వస్తారు'' అని ప్రెస్‌మీట్‌లో సంచలనాత్మక కామెంట్‌ ఇచ్చారు బాలయ్య. ఆ తరువాత ఇక జూనియర్‌ను ఇంట్లో పెళ్ళిల్ళకూ ఫంక్షన్లకూ పిలువనేలేదు.

పోనివ్‌ కొన్ని రోజులు కామ్‌గా వదిలేస్తే గొడవ సద్దుమణిగి పోతుంది అనుకుంటే, ఇంతలో ఎన్టీఆర్‌కు ఆప్తుడైన కొడాలి నాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి చంద్రబాబునూ, బాలయ్యను బూతులు తిట్టడం స్టార్ట్‌ చేశాడు. ఈ మధ్యకాలంలో ఇది చాలా తారాస్థాయికే చేరుకుంది. ఈ టైములో జూనియర్‌ కూడా సర్దుబాటు చర్యలకూ, ఏదైనా సెటిల్‌మెంట్‌కూ యత్నించకుండా సై అంటే సై అనే నానుడిలోనే ఉన్నాడని టాక్‌. అందుకే బాలయ్యకు కూడా చిర్రెత్తుకొచ్చి.. నిన్న లయన్‌ మీటింగ్‌లో స్ట్రయిట్‌ ఫార్‌వార్డ్‌ పంచ్‌ వేశాడు.

కాని ఈ ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు అభిమానులను సందిగ్దంలోకి నెట్టేశాయి. ఇంతకీ తాము బాలయ్యకు సపోర్టు చేయాలా లేకపోతే జూ.ఎన్టీఆర్‌కు సపోర్టు చేయాలో అనే డైలామాలో పడిపోయారు వారు. బాలయ్య ఇంత ఓపెన్‌గా తిట్టేశాక కూడా తేల్చుకోకపోతే ఎలా మరి. అయితే బాలయ్య తిట్టింది జూనియర్‌ను కాదు, ఎవరినో అంటూ నొక్కించే చెప్పే అభిమానులూ ఉన్నారులేండి.. అలాంటివి వింటే నవ్వొచ్చేస్తోంది మరి.