Begin typing your search above and press return to search.

'BB3'లో అఘోరా పాత్రని అలా డిజైన్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   15 March 2021 8:30 AM GMT
BB3లో అఘోరా పాత్రని అలా డిజైన్ చేస్తున్నారా..?
X
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్న ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు అన్నదమ్మలు పెద్దయ్యాక ఒకరు రాజకీయ నాయకుడుగా మరొకరు అఘోరాగా మారతాడట. నిజానికి అఘోరా అంటే జడలు పెరిగిన జుట్టుతో ఒంటి నిండ బూడద పూసుకుని ఉంటారు. అయితే అలాంటి గెటప్ లో బాలయ్యను చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడరు కాబట్టి బోయపాటి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. అఘోరాని తపించేలా లాల్చీ మరియు పంచె కట్టులో బాలయ్యని పవర్ ఫుల్ గా చూపిస్తున్నారట. ఇప్పటికే విడుదల చేసిన 'బీబీ3' టీజర్ లో బాలయ్య ఒక గెటప్ ని చూపించిన విషయం తెలిసిందే. రాబోయే షెడ్యూల్ లో బాలయ్య అఘోరా పాత్రకి సంబధించిన చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం.

ఇదిలా ఉండగా ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి బీబీ3 వస్తుందా లేదా అనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని షెడ్యూల్స్ నెమ్మదిగా జరగడంతో పాటుగా ఎక్కువ మంది కలిసి నటించే సన్నివేశాల విషయంలో మెయిన్ ఆర్టిస్టుల డేట్స్ సమస్య వస్తోందట. కాకపోతే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే బాలయ్య - బోయపాటి చెప్పిన టైం కి పక్కా వస్తారని కూడా అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో 'అఖిల్' బ్యూటీ సయేషా సైగల్ - 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై నందమూరి ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.