Begin typing your search above and press return to search.

అది తప్పు.. అందుకే ప్రోత్సహించను: హీరో బాలయ్య

By:  Tupaki Desk   |   10 Jun 2020 1:00 PM GMT
అది తప్పు.. అందుకే ప్రోత్సహించను: హీరో బాలయ్య
X
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఈ రోజుతో అరవై యేళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయడం పై బాలయ్య అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల పై చర్చలు నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా.. హీరో బాలకృష్ణ ఇంతవరకు ఏ ప్రోడక్ట్ బ్రాండ్‌ను.. ఏ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించక పోవడం పై చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలయ్య ఏ బ్రాండ్ ను కూడా ప్రోమోట్ చేయకపోడానికి ఒక కారణం ఉందట. అదికూడా స్వయంగా బాలయ్య వివరిస్తూ.. “ఇది నా తండ్రి నిర్ణయం. ఏ బ్రాండ్‌ను ఆమోదించవద్దని లేదా ప్రచారం చేయవద్దని ఆయన ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే అది మేము ప్రోత్సహించినందుకు అభిమానులు దానిని కొనుగోలు చేస్తారు.

కాబట్టి అది తప్పు అని చెప్పేవారు. నా తండ్రి చెప్పినదాన్ని బలమైన నమ్మకంతో తూచా తప్పకుండా పాటిస్తున్నాను" అని బాలయ్య వివరణ ఇచ్చారు. అంతేగాక బాలయ్య గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు హల్చల్ చేస్తున్నాయి. అవి ఆయన అభిమానులకు కూడా తెలియదట. అసలు విషయం ఏంటంటే.. ఇండియా టుడే మ్యాగజైన్ ప్రత్యేక ఎడిషన్ విడుదల చేసిన అతి కొద్ది మంది నటులలో బాలకృష్ణ ఒకరు. అలాగే 43వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలకృష్ణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇది చాలా మంది తెలుగు నటులకు లభించని అరుదైన గౌరవం. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఇదివరకే వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు ఇండస్ట్రీలో సంచలన విజయాలు నమోదు చేసాయి. ఇక ఈ కొత్త సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.