Begin typing your search above and press return to search.

ఆ సినిమా చేయాల్సింది కాదు-బాలయ్య

By:  Tupaki Desk   |   4 Sept 2017 10:38 PM IST
ఆ సినిమా చేయాల్సింది కాదు-బాలయ్య
X
ప్రతి హీరో కెరీర్లోనూ అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలు చేస్తున్నపుడు సందేహాలు కలుగుతాయి. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఈ సినిమా చేయాల్సింది కాదేమో అనిపిస్తుంది. ఇలాంటి సినిమాల గురించి కొందరు ఓపెనవుతారు. కొందరు సమాధానం దాట వేస్తారు.

నందమూరి బాలకృష్ణ ముందు ఇదే ప్రశ్న ఉంచితే.. ఆయనేమీ తడుముకోలేదు. ఒక్క మాటలో సమాధానం చెప్పేశాడు. తన కెరీర్లో ‘ఒక్క మగాడు’ సినిమాను తాను చేయాల్సింది కాదని బాలయ్య అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో అంతకుమించి బాలయ్య ఒక్క మాటా మాట్లాడలేదు. ఐతే ఆయన సమాధానం చెప్పిన తీరు చూస్తే ‘ఒక్క మగాడు’ విషయంలో బాలయ్య చాలానే రిగ్రెట్ అయ్యాడని తెలుస్తోంది.

వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఒక్క మగాడు’ బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో ఒకటి. ‘దేవదాసు’ లాంటి సూపర్ హిట్ తర్వాత వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందించడం.. ‘ఒక్క మగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడం.. భారీ బడ్జెట్.. భారీ తారాగణం.. అన్నీ తోడై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేక బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం.