Begin typing your search above and press return to search.

రిషి కపూర్ మరణం పై బాలయ్య సంతాపం..

By:  Tupaki Desk   |   30 April 2020 6:30 PM IST
రిషి కపూర్ మరణం పై బాలయ్య సంతాపం..
X
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రెండు రోజులుగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ 24గంటలు తిరగకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, ఆ మరుసటి రోజే అంటే ఈరోజే మరో విలక్షణ నటుడు రిషి కపూర్ మరణించడంతో సినీ ప్రముఖులు వారి సంతాపాన్ని తెలుపుకుంటున్నారు. ఈ నమ్మశక్యం కానీ విషయాల పై స్పందించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్ల ద్వారా కోరుతున్నారు. ఇదివరకే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - సూపర్ స్టార్ రజినీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి - మోహన్ బాబు..

మహేష్ బాబు - అల్లు అర్జున్ - తమన్నా - అనసూయ, -తాప్సి - నిధి అగర్వాల్ లాంటి ఎందరో సినీ తారలు రిషి మృతిపట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రిషి కపూర్ మృతి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ''రిషి కపూర్ - ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. బాలయ్యతో పాటు ప్రముఖులు సుబ్బిరామిరెడ్డి కూడా ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు.