Begin typing your search above and press return to search.

హీరోచిత అంటూ 'ఎన్టీఆర్‌' సందడి షురూ

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:42 AM GMT
హీరోచిత అంటూ ఎన్టీఆర్‌ సందడి షురూ
X
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సందడి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమద్య కాలంలో తెలుగు సినిమాల ప్రమోషన్‌ శైలి మారింది. నెల రోజుల ముందు నుండే ఒక్కో పాటను విడుదల చేస్తూ మీడియాలో కవరేజ్‌ ఎక్కువ అయ్యేలా చూస్తున్నారు. తాజాగా ‘ఎన్టీఆర్‌’ విషయంలో కూడా అదే చేస్తున్నారు. విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా ఉండగానే ‘ఎన్టీఆర్‌’ నుండి మొదటి పాట విడుదలకు సిద్దంగా ఉంది.

‘ఎన్టీఆర్‌’ హీరోగా ఎదిగిన క్రమం తెలిపేలా హీరోచిత.. అనే సాంగ్‌ ఉండబోతుందట. ఆ పాటను మొదటగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఎన్టీఆర్‌ మూవీ నుండి మొదటి పాట అనగానే మీడియాలో మరియు ఫ్యాన్స్‌ - ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు పాటలు హైలైట్‌ గా నిలుస్తాయని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఎన్‌ టి‌ఆర్ సినిమాల్లోని పలు పాటలను ఉన్నది ఉన్నట్లుగా వాడనుండగా - కొన్ని మాత్రం కొత్తగా ట్యూన్‌ చేస్తున్నారు.

క్రిష్‌ మంచి సంగీతంను కీరవాణి నుండి రాబట్టుకుంటాడనే నమ్మకంను మొదటి నుండి కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రంకు కీరవాణి మంచి సంగీతం అందించాడని - అందుకే ప్రముఖ సంగీత సంస్థ లహరి వారు ఈ చిత్రం ఆడియో రైట్స్‌ ను ఏకంగా రెండు కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్య మూవీ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈస్థాయిలో ఆడియో రైట్స్‌ అమ్ముడు పోలేదు. ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌ లు కూడా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ పబ్లిసిటీ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే ఇప్పటి నుండే పబ్లి సిటీని షురూ చేసినట్లున్నారు.