Begin typing your search above and press return to search.

బాలయ్యకు లవకుశ తెగ నచ్చిందట

By:  Tupaki Desk   |   16 Sept 2017 11:44 PM IST
బాలయ్యకు లవకుశ తెగ నచ్చిందట
X
ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు.. దాని గురించి ఎన్ని యాంగిల్స్ లో ఎన్ని వార్తలు రావాలో అన్నీ వచ్చేస్తుంటాయి. కాని అందులో కొన్ని మాత్రమే రూమర్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నఅతిపెద్ద రూమర్ ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన అన్న తనయుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ''జై లవ కుశ'' సినిమాను చూడటం. ఇంతకీ అసలు సంగతేంటో చూద్దాం పదండి.

ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది కళ్యాణ్‌ రామ్ కాబట్టి.. ఆయన సినిమాకు సంబంధించిన ఒక స్ర్కీనింగ్ ను బాలయ్య కోసం ఏర్పాటు చేశారని.. అది చూసిన బాలయ్య ఎన్టీఆర్ ను అభినందించారని ఫేస్ బుక్ లో చాలా పోస్టులు పుట్టుకొస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనే నిజంగానే నిజం ఉందా? అసలు ఇప్పటివరకు జై లవ కుశ సినిమాను ఎవ్వరికీ చూపించలేదట కళ్యాణ్‌ రామ్. పైగా సినిమా రిలీజ్ కు వారం ఉన్నా కూడా.. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి.. వాటిపైనే ఫోకస్ పెట్టారట. సో బాలయ్య ఈ సినిమాను చూశారనేది కేవలం రూమర్ మాత్రమే.

ఇకపోతే జై లవ కుశ సినిమా ఈ దసరా సెలవులను పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసుకుంటూ.. సెప్టెంబర్ 21న వస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కంటే గట్టి హిట్టే కొడతాడని ట్రేడ్ వర్గాలన్నీ ఆశిస్తున్నాయి. కె.ఎస్.రవీంద్ర డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా.. నివేథా తామస్ హీరోయిన్లు కాగా.. ఒక ప్రత్యేక గీతంలో తమన్నా నటిస్తోంది.