Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ గా నటిస్తాననుకోలేదు!- బాలకృష్ణ
By: Tupaki Desk | 22 Dec 2018 3:52 PM ISTనిన్న జరిగిన `కథానాయకుడు` ఆడియో ఎన్టీఆర్ అభిమానుల్లో ఎన్నో సందేహాలకు సమాధానంగా నిలిచింది. ఓ రకంగా స్పష్టతనిచ్చిందనే చెప్పాలి. అసలు ఈ సినిమా పుట్టుక సహా ప్రతిదీ పూసగుచ్చి విడమర్చి మరీ చెప్పారు ఎన్ బీకే. అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో తాను నటిస్తానని ఏనాడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ -``ఈ సినిమాలో భాగం కావడం పూర్వజన్మ సుకృతంగా భావించి పనిచేశాం. ఐశ్వర్యం - పేరు ప్రతిష్టలనేవి మన పూర్వజన్మ రుణాన్ని బట్టే వస్తుంది. ఎవరైనా నువ్వు ఎవరివి అని నన్ను అడిగితే భారతీయుడిని అంటాను. అదే ప్రశ్న మరోసారి అడిగితే తెలుగువాడినని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారక రామారావు కొడుకునని అంటాను. మళ్లీ అడిగితే ఓ అన్నగారి అభిమానిని అంటాను. ఆయనకు సాటిలేరు ఎవ్వరూ. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఎన్టీఆర్ గా నటిస్తానని అనుకోలేదు. ఇది నమ్మశక్యంగానూ లేదు`` అన్నారు.
నాన్నగారు చేసినన్ని పాత్రలను మీరు చేస్తారా? అని ఎవరైనా అడిగితే.. నాన్నగారు చేయని రెండు పాత్రలు నారదుడు - గౌతమిపుత్ర శాతకర్ణిని చేశానని చెప్పుకునేవాడిని. అలాంటిది ఆయన పాత్రే చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సంకల్ప బలం ఉంటే ప్రకృతే మనతో ఆ పని చేయిస్తుంది. ఈ సినిమాలో కర్త - కర్త మా తండ్రిగారు - తల్లిగారు అయితే మేం క్రియ మాత్రమే అని అన్నారు ఎన్ బీకే.
తొలుత రెండు భాగాలు చేయాలని అనుకోలేదు. అయితే రెండు భాగాలు సరిపోవు. గాంధీ సినిమా ఉంది. .. మహానటి సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ జీవితం లార్జర్ దేన్ లైఫ్. అందుకనే ఆయన జీవిత సారాంశం మాత్రమే తీసుకున్నాను. రెండు భాగాలు కలిసి 89 రోజులు మాత్రమే పనిచేశాం. నా సినిమాలు చేస్తున్నప్పుడు ఆడినా - ఆడకపోయినా భాష ముఖ్యంగా బావుంటుంది. ఇక నాన్నగారి గురించి చెప్పాలంటే నాకు తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే యన్.టి.ఆర్ ఆనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. తెలుగుజాతే కాదు... యావత్ భారతదేశం గుర్తుంచుకోదగ్గ మనిషి ఆయన. అందుకే తెలుగులోనే కాదు. మలయాళం - హిందీ - తమిళంలో కూడా అనువదించి విడుదల చేస్తాం అనీ అన్నారు. అన్న హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించారు. తను వాళ్ల నాన్నగారి పాత్రను చేస్తే నేను నాన్నగారి పాత్రను చేశాను. మా మనవడేమో నా చిన్నప్పటి పాత్రను చేశాడు. అందరినీ దేవుడే తీసుకొచ్చి పాత్రలను చేయించాడు. రానా చంద్రబాబు నాయుడిలా నటించారు. భరత్ రెడ్డి మా పెద్దబావ పాత్రను చేశారు. సుమంత్ ఎ.ఎన్.ఆర్ పాత్రలో చేశారని తన సినిమా పాత్రధారుల గురించి బాలయ్య చెప్పారు.