Begin typing your search above and press return to search.

మహానాయకుడుతో బూతు పిక్కుల పోటీ

By:  Tupaki Desk   |   20 Feb 2019 10:25 PM IST
మహానాయకుడుతో బూతు పిక్కుల పోటీ
X
ఈమధ్య తెలుగులో బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుందని జనాలు అనుకుంటున్నారు కానీ వాటితో పాటుగా అడల్ట్ కంటెంట్ సినిమాల జోరు కూడా పెరిగింది. ఎలాగూ విమర్శించే జనాల నోటిని కుట్టేసినా విమర్శిస్తూనే ఉంటారని కొందరు ఫిలిం మేకర్లు ఫిక్స్ అయ్యారో ఏమోగానీ బూతు సినిమాలను తీయడమే కాదు వాటిలో అడల్ట్ కంటెంట్ దంచికొడుతున్నారు.. వాటికి చితగ్గొట్టే టైటిల్స్ పెడుతున్నారు.

ఈ వారాంతంలో విడుదల కానున్న సినిమాలలో ముఖ్యమైనది 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ సినిమాకు పోటీగా మూడు అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమా ఒకటి. టైటిల్లోనే కంటెంట్ ను ఎంత కళాత్మకంగా చెప్పారో.. ఇంకా సినిమా గురించి పెద్దగా వివరించాల్సిన పనిలేదు కదా. అయినా ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే బూతు సినిమా ప్రియులను విపరీతంగా ఆకర్షించింది. చితక్కొట్టుడు తో పాటుగా '4 లెటర్స్' అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. టైటిల్ సాఫ్ట్ గా ఉందనే గానీ లోపల ఫుల్ బూతు కంటెంటే.

వీటితో పాటుగా ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ నటించిన 'మిఠాయి' కూడా రిలీజ్ అవుతోంది. దీన్ని మరీ బూతని అనలేం కానీ అడల్ట్ కంటెంట్ అయితే కొంత ఉంది. ఈ లెక్కన ఈ మూడు అడల్ట్ కంటెంట్ సినిమాలు 'ఎన్టీఆర్ మహానాయకుడు' తో అమీతుమీ తేల్చుకుంటాయన్నమాట. ఇదిలా ఉంటే మహా-అడల్ట్ ఫైట్ మధ్యలో సందిట్లో సడేమియాలాగా నయనతార డబ్బింగ్ ఫిలిం 'అంజలి సీబీఐ' సినిమా కూడా విడుదల అవుతోంది. మరి ఈ ఐదు సినిమాలలో మీ మనసులో ఉండే సినిమా ఏది.. మీరు సినిమాకు టికెట్ కొంటారు?