Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్‌' కు అదే పెద్ద లోటు

By:  Tupaki Desk   |   10 Jan 2019 11:46 AM GMT
ఎన్టీఆర్‌ కు అదే పెద్ద లోటు
X
ఎన్టీ రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించగా క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కింది. బాలకృష్ణ కెరీర్‌ లోనే మంచి ఓపెనింగ్స్‌ ను ఈ చిత్రం దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరోగా ఎలా స్టార్‌ అయ్యారనే విషయాలను చూపించారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలను మర్చారు.

ఎన్టీఆర్‌ బాల్యం ఎలా సాగింది, అసలు ఎన్టీఆర్‌ కు మొదటి ఆఫర్‌ ఎలా వచ్చిందనే విషయాలను చూపించలేదు. ఎన్టీఆర్‌ గారికి అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌ గారు సినిమాల్లో ఆఫర్‌ ఇస్తానన్నారు. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. కాని ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో మాత్రం ఆ విషయాన్ని గురించి ప్రస్థావించలేదు. ఎన్టీఆర్‌ సినీ రంగ ప్రవేశం గురించిన సీన్స్‌ అసంపూర్తిగా ఉన్నాయి. నేరుగా ఎన్టీఆర్‌ హీరో అయిన విషయాన్ని చూపించడంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పడ్డ ఇబ్బందులను ప్రేక్షకులకు తెలియకుండా పోయింది.

ఇక ఎన్టీఆర్‌ కొడుకులు, కూతుర్ల విషయాల్లో కూడా పూర్తి క్లారిటీ లేకుండా స్క్రీన్‌ ప్లే నడిచింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్‌ కు పరిచయం ఎక్కడ అయ్యింది, ఆ పరిచయం ఎలా బంధుత్వంగా మారిందనే విషయాలను చూపించలేదు. కనీసం చంద్రబాబు నాయుడు - భువనేశ్వరిల పెళ్లిల గురించైనా చూపిస్తే బాగుండేది. జీవితం అన్నప్పుడు రెండు షేడ్స్‌ ఉంటాయి. సుఖ సంతోషాల కలయికే జీవితం. రెండు చూసినప్పుడే సినిమా అయినా రక్తి కడుతుంది. కాని ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాలో కేవలం ఎన్టీఆర్‌ హ్యాపీ మూమెంట్స్‌, సక్సెస్‌ లను మాత్రమే చూపించారు. సినిమాల కోసం పడ్డ కష్టం, పొందిన ఫ్లాప్‌ లు - ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇలా ఏవి కూడా చూపించలేదు. అవి చూపించక పోవడం ఎన్టీఆర్‌ కు పెద్ద లోటు. ఇక రెండవ పార్ట్‌ లో ఎలా ఉంటుందో చూడాలి.