Begin typing your search above and press return to search.

తమిళనాట 'ఎన్టీఆర్‌' ధర్నా ఏంటో?

By:  Tupaki Desk   |   15 Nov 2018 10:20 AM IST
తమిళనాట ఎన్టీఆర్‌ ధర్నా ఏంటో?
X
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌ లకు సంబంధించిన చిత్రీకరణను ఒకే సారి పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్‌ మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అనుకున్నట్లుగానే డిసెంబర్‌ వరకు ‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌ ల చిత్రీకరణ ముగించే అవకాశం కనిపిస్తుంది. ‘ఎన్టీఆర్‌’ చిత్రంకు సంబంధించిన సీన్స్‌ ప్రస్తుతం సారధి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.

సారధి స్టూడియోలో 1980 ల్లో చెన్నై వీధిని ప్రతిభించేలా సెట్‌ ను నిర్మించడం జరిగింది. ఆ సెట్‌ లో మొత్తం తమిళ పేర్లు - తమిళ బోర్డులు - తమిళ మనుషులు కనిపిస్తున్నారు. అంటే చెన్నై నేపథ్యంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ వీధిలో వందలాది మందితో దర్నా కార్యక్రమంను షూట్‌ చేస్తున్నారు. రెండు రోజులుగా అందుకు సంబంధించిన సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ‘ఎన్టీఆర్‌ మహానాయుడు’ కోసం ఈ సీన్స్‌ ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ మహానాయుడు చిత్రంలో తెలుగు రాష్ట్రంలోని రాజకీయం - ఎన్టీఆర్‌ పార్టీ పెట్టడం చూపిస్తారని అంతా అనుకుంటున్నారు. కాని క్రిష్‌ మాత్రం అనూహ్యంగా తమిళనాట దర్నా - రాస్తా రోకోకు సంబంధించిన సీన్స్‌ ను చిత్రీకరించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ‘ఎన్టీఆర్‌ మహానాయుడు’ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సీన్స్‌ ఏమైనా ఉంటాయేమో అంటూ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ సినీ జీవితం చెన్నైలో సాగినా రాజకీయ జీవితం మాత్రం ఏపీలోనే కొనసాగింది. మరి అలాంటప్పుడు చెన్నైలో ధర్నా ఏంటో చూడాలి. ‘ఎన్టీఆర్‌ మహానాయుడు’ చిత్రం రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాలయ్య తో పాటు ఈ చిత్రంలో విద్యాబాలన్‌ - రానా - సుమంత్‌ - నిత్యామీనన్‌ - కీర్తి సురేష్‌ - రకుల్‌ ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.