Begin typing your search above and press return to search.

ఒకే రోజు భలే పట్టాలెక్కాయి

By:  Tupaki Desk   |   5 July 2018 6:31 AM GMT
ఒకే రోజు భలే పట్టాలెక్కాయి
X

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ కథలు చరిత్రాత్మక కథలు చాలానే తెరకెక్కుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా బయోపిక్ లు కూడా వస్తుండడం ప్రశంసించాల్సిన విషయం. ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం రెండు డిఫరెంట్ సినిమాలు ఈ రోజే పట్టాలెక్కయి. షూటింగ్ ఓకేరోజున స్టార్ట్ అవ్వడం మంచి తరుణమని చెప్పాలి. ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ అయితే మరొక క్రేజీ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ ఎంటర్టైనర్ F2.

నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో ఆయన తనయుడు బాలకృష్ణ కనిపించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు సినిమా మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సన్నివేశాలను ఒక భారీ సెట్ లో బాలకృష్ణతో ఈ రోజు స్టార్ట్ చేశారు. ఇక ఒక షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత మిగతా నటీనటులను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ఇక మరొక క్రేజీ ప్రాజెక్ట్ F2 కూడా ఈ రోజే స్టార్ట్ అయ్యింది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని బోరబండలో హీరోలిద్దరి మధ్య సీన్స్ ను తెరకెక్కించారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2 మరియు ఎన్టీఆర్ రెండు సినిమాలు ఈ రోజే మొదలయ్యాయి. అలాగే సంక్రాంతి నాడు రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ఇరు చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.