Begin typing your search above and press return to search.

బాలయ్య అలాంటోడు కాదు : కేఎస్‌ రవికుమార్‌

By:  Tupaki Desk   |   19 Dec 2019 8:05 AM GMT
బాలయ్య అలాంటోడు కాదు : కేఎస్‌ రవికుమార్‌
X
బాలకృష్ణ అభిమానులను మరియు తన అసిస్టెంట్స్‌ పై దురుసగా ప్రవర్తించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చాలానే ఉంటాయి. బాలయ్య ఎప్పటికప్పుడు ఇలాంటి వివాదాస్పద చేష్టలతో మీడియాలో ఉంటూనే ఉంటాడు. షూటింగ్‌ లో రెగ్యులర్‌ గా ఎవరి మీదో ఒకరి మీద అరిచేస్తాడని.. ఉన్నంత సేపు బాగానే ఉండి వర్క్‌ సరిగా అవ్వకుంటే కోపంతో ఊగిపోతాడు అనే టాక్‌ ఉంది. బాలయ్యకు ఉన్న ఆ చెడ్డ పేరును తొలగించేందుకు దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చౌదరి బాలయ్య తరపున వకాల్తా పుచ్చుకున్నట్లున్నాడు.

జైసింహా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన చిత్రం 'రూలర్‌'. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రూలర్‌ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన కేఎస్‌ రవికుమార్‌ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బాలకృష్ణతో వర్క్‌ అనుభవం గురించి చెప్పాడు. బాలకృష్ణ గారికి ముక్కుమీద కోపం ఉంటుందని ఎక్కువగా సెట్స్‌ లో కోపంతో ఊగిపోతాడని ఎవరిపైనో ఒకరిపైన చేయి చేసుకుంటాడని ప్రచారం జరుగుతుంది కదా దానిపై మీ కామెంట్‌ ఏంటీ అంటూ కేఎస్‌ రవికుమార్‌ ను ప్రశ్నించగా ఆ కామెంట్స్‌ ను కొట్టి పారేశాడు.

ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఎక్కువగా తన అసిస్టెంట్స్‌ పై మాత్రమే కోప్పడతారు. వారు ఏదైనా తప్పు చేసినా లేదంటే పని సరిగా చేయక పోయినా కూడా కోపం వస్తుంది. ఆ సమయంలో వారిపై కోప్పడ్డా ఆ తర్వాత మళ్లీ వారితో కూల్‌ గానే ఉంటాడు. ఇక సినిమా టెక్నీషియన్స్‌ విషయంలో ఆయన కూల్‌ గానే వ్యవహరిస్తాడని పని పట్ల చాలా నిబద్దతతో ఉంటాడు కనుక అనుకున్నట్లుగా షూట్‌ సాగకుంటే అప్పుడు ఆయనకు కోపం వస్తుందని దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ అన్నాడు. మొత్తానికి మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా బాలయ్య చీటికి మాటికి చిన్న విషయానికి కూడా ఇతరులను కొట్టడు అని కేఎస్‌ రవికుమార్‌ చెప్పాడు.