Begin typing your search above and press return to search.

ఈ లుక్ చాలు బాలయ్య.. అదిరింది!

By:  Tupaki Desk   |   1 Aug 2022 1:30 PM GMT
ఈ లుక్ చాలు బాలయ్య.. అదిరింది!
X
కరెక్ట్ గా ఉపయోగించుకుంటే నందమూరి బాలకృష్ణ తో ఊహించిన విధంగా మాస్ సినిమాలు తెరపైకి తీసుకురావచ్చు అని కొంతమంది దర్శకులు చెబుతూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టుగా వర్క్ చేసే నెంబర్ వన్ దర్శకుల్లో బోయపాటి శ్రీను అని ఇదివరకే మూడుసార్లు రుజువయింది. ఆ తర్వాత అతని తరహాలోనే గోపీచంద్ మలినేని కూడా బాలయ్య బాబును పవర్ఫుల్ మాస్ ఇమేజ్ లో చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది.

ఇప్పటివరకు కేవలం సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ద్వారానే ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పొలిటికల్ ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న నందమూరి బాలకృష్ణ 107వ సినిమా షూటింగ్ ప్రస్తుతం చేరవేగంగా కొనసాగుతోంది. దాదాపు చిత్రీకరణ అయితే తుది దశకు చేరుకుంది.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ షూటింగ్ ఎక్కడ జరిగినా కూడా అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు ఏగబడుతున్నారు. ఇక బాలయ్య కూడా వీలైనంతవరకు అభిమానులను కలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ను ఏమాత్రం వెనక్కి పంపకుండా అలాగే మార్గం మధ్యలో కూడా తనను చూడాలని అనుకునే వారికి కూడా ఆయన దర్శనమిస్తున్నారు.

రీసెంట్గా నందమూరి బాలకృష్ణ అభిమానులకు కనిపించిన విషణం మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. వైట్ డ్రెస్ లో, గుబురు గడ్డం తో, కళ్ళకి స్టైలిష్ గ్లాసెస్ పెట్టుకొని సూపర్ మాస్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న బాలయ్య ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకునేలా ఉన్నాడు అని అర్థమవుతుంది.

ఇక దర్శకుడు గోపీచంద్ త్వరలోనే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. అసలైతే దసరా సమయంలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కాస్త షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు నవంబర్లో లేదా డిసెంబర్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నాట్లుగా తెలుస్తోంది.