Begin typing your search above and press return to search.

బాలయ్య షాకింగ్ డెసిషన్

By:  Tupaki Desk   |   25 March 2018 11:20 AM IST
బాలయ్య షాకింగ్ డెసిషన్
X
నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపికలో కొన్నిసార్లు సంచలన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. దర్శకుల ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా వాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ‘జై సింహా’తో కె.ఎస్.రవికుమార్‌ కు అలాగే ఛాన్సిచ్చాడు. ఇప్పుడు ఇలాంటి సంచలన నిర్ణయమే ఇంకోటి తీసుకున్నాడు నందమూరి హీరో. ‘ఇంటిలిజెంట్’తో కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో బాలయ్య సినిమా చేయబోతుండటం విశేషం. బాలయ్యతో ‘జై సింహా’ తీసిన సి.కళ్యాణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి కళ్యాణే స్వయంగా ప్రకటన చేశాడు. మే 27న ఈ చిత్రం ప్రారంభమవుతుందని కూడా ఆయన ప్రకటించారు.

‘ఇంటిలిజెంట్’ ఫలితం చూసిన ఏ స్టార్ హీరో కూడా వినాయక్ తో సినిమా చేయడానికి ముందుకొస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. గత కొన్నేళ్లలో వినాయక్ ట్రాక్ రికార్డు పేలవంగా ఉంది. ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయినా.. అది రీమేక్ కావడం.. దానికి చిరు రీఎంట్రీ మేనియా తోడవడం వల్లే అది ఆడిందన్న అభిప్రాయం ఉంది కానీ.. దాని సక్సెస్ క్రెడిట్ ఏమీ వినాయక్ కు రాలేదు. అందులోనూ ‘ఇంటిలిజెంట్’ దారుణ ఫలితాన్నందుకున్నాక ఈ అభిప్రాయం మరింత బలపడింది. ఈ సినిమాలో వినాయక్ పనితనం తీవ్ర విమర్శల పాలైంది. ఆయనలో విషయం అయిపోయిందన్న అభిప్రాయం కలిగింది జనాలకు. ఐతే బాలయ్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా అతడితో సినిమా ఓకే చేయడం విశేషం. అసలు ‘ఇంటిలిజెంట్’తో భారీ నష్టాలు చవిచూసిన కళ్యాణ్.. మళ్లీ వినాయక్ తో సినిమా చేయాలనుకోవడమూ ఆశ్చర్యమే.