Begin typing your search above and press return to search.

బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   7 Dec 2017 5:37 AM GMT
బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు
X
నందమూరి బాలకృష్ణ జోరు ఇప్పుడు మామూలుగా లేదు. సహజంగానే ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేసే ఈయన.. వయసు పెరుగుతున్న కొద్దీ వేగం పెంచేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య.. ఇప్పటికే పూరీతో పైసా వసూల్ ని కూడా అందించేశారు. అప్పటికే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ.. మూడు రోజుల క్రితం జై సింహా షూట్ ను ఫినిష్ చేసేశారు.

సంక్రాంతి సందర్భంగా జై సింహా విడుదల కానుండగా.. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టును ఖాయం చేసేశారట. జనవరి నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని మొదలుపెడతారని తెలుస్తోంది. యమలీల.. ఘటోత్కచుడు తరహాలో మరోసారి ఫ్యాంటసీ సబ్జెక్టును తీసుకుని బాలకృష్ణను అప్రోచ్ కాగా.. ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన సబ్జెక్టు బాలయ్యను ఆకట్టుకుందని తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేద్దామని అన్నారట బాలయ్య. అంటే నెల రోజుల గ్యాప్ లోనే మరో సినిమా మొదలుపెట్టేస్తుండడం విశేషం.

జై సింహా తర్వాత నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ దర్శకుడు తేజ.. వెంకటేష్ తో సినిమాను ప్రారంభించనున్నాడు. ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెడతాడు. ఈలోగా ఎస్వీ కృష్ణారెడ్డి ముూవీ పూర్తి చేసేస్తారట బాలయ్య. ఈయన జోరు అందుకోవడం కుర్రాళ్లకు కూడా సాధ్యం కాదేమో!