Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాడితో బాలయ్య సినిమా??

By:  Tupaki Desk   |   1 April 2017 6:00 PM GMT
కొత్త కుర్రాడితో బాలయ్య సినిమా??
X
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమాను పూరి జగన్ డైరక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలై రెండవ షెడ్యూల్ కూడా దిగ్విజయంగా సాగుతోంది. అయితే ఇప్పుడు బాలయ్య తన తదుపరి సినిమాపై కూడా బాగా ఫోకస్ పెట్టేశారట. ఆల్రెడీ కృష్ణవంశీ చెప్పిన రైతు కథ.. కె.ఎస్.రవికుమార్ చెప్పిన సబ్జెక్ట్.. పరుచూరి కిరిటి నెరేట్ చేసిన కథ.. పి.వాసు చేద్దాం అన్న థ్రిల్లర్.. ఇలా ఈయన చేతిలో చాలానే ఉన్నాయ్. అయితే వాటన్నింటినీ తోసిపుచ్చి బాలయ్య ఒక కొత్త కుర్రాడికి ఓటేశారని అంటున్నారు సన్నిహితులు.

ఒక కొత్త యంగ్ కుర్రాడు బాలయ్యను కలసి ఒక కథను వినిపంచాడట. కథ కొత్తగా ఉండటంతో పాటు ఒక యంగ్ స్టర్ తనకు కథ చెప్పడంతో బాలయ్యకు ఫుల్ కిక్కొచ్చేసిందట. ఇప్పటివరకు తను విన కథలన్నీ సూపర్ హీరోయిజంతో కొట్టుమిట్టాడుతుంటే... ఈ కుర్రాడి కథ మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉందట. అందుకే బాలయ్య కథలో కొన్ని మార్పులు చేసి తీసుకురమ్మని చెప్పారట. ఒకవేళ మార్పులు ఓకె అనుకుంటే మాత్రం 102వ సినిమాగా వెంటనే ఈ కొత్త కుర్రాడి డైరక్షన్లో సినిమా టేకాఫ్‌ అయ్యే ఛాన్సుందని అంటున్నారు సన్నిహితులు. వెయిట్ అండ్ సి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/