Begin typing your search above and press return to search.

చిరు కథ బాలయ్య చేతికి చేరిందా?

By:  Tupaki Desk   |   28 Jan 2017 7:44 PM GMT
చిరు కథ బాలయ్య చేతికి చేరిందా?
X
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి అంచనాలకు తగ్గట్లుగానే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు 101వ చిత్రాన్ని ఫైనలైజ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కృష్ణవంశీతో రైతు చిత్రాన్ని చేస్తారనే టాక్ గట్టిగా వినిపించినా.. ఇప్పుడా ప్రాజెక్టును పక్కన పెట్టేశారని అంటున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే.. కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి కేఎస్ రవికుమార్ తో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని టాక్ గతంలో వినిపించింది. ఓ కథ వినిపించగా.. దాన్ని డెవలప్ చేయమని చిరంజీవి అన్నారట. చిరు 151వ సినిమా ఈ దర్శకుడితోనే చేసే ఛాన్సులు ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డితో 151వ సినిమా.. బోయపాటి శ్రీనుతో 152వ సినిమా చిరు చేస్తారనే విషయం తెలిపోయింది. దీంతో చిరుకు చెప్పిన కథనే.. బాలయ్యకు వినిపించి ఒప్పించాడట దర్శకుడు కేఎస్ రవికుమార్.

ఇప్పటికైతే రైతు సబ్జెక్టును హోల్డ్ లో పెట్టేయడంతో పాటు.. ఎస్వీ కృష్ణారెడ్డితో చెప్పిన కథను కూడా కొన్నాళ్లపాటు పక్కన పెట్టేశారు బాలయ్య. ఇప్పుడు కేఎస్ రవికుమార్ సినిమాను పట్టాలెక్కించడానికి బాలయ్య సిద్ధమవుతున్నారట. గతంలో రజినీకాంత్.. కమల్ హాసన్.. చిరంజీవి లాంటి దర్శకులతో సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. చివరగా రజినీతో లింగా లాంటి ఫ్లాప్ మూవీ తీశాడు.