Begin typing your search above and press return to search.

సంక్రాంతిని మిస్ అవుతున్న బాలయ్య...?

By:  Tupaki Desk   |   14 Oct 2019 11:58 AM GMT
సంక్రాంతిని మిస్ అవుతున్న బాలయ్య...?
X
ఒకప్పుడు సంక్రాంతి హీరో అంటే బాలయ్య గుర్తు వచ్చేవారు. అంతలా బాలయ్య సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే అప్పట్లో ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా బాలయ్య ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తుందనుకున్న బాలయ్య, కేఎస్ రవికుమార్ చౌదరీల సినిమా ఆ సీజన్ లో రాదంటున్నారు. సంక్రాంతి ముందు క్రిస్మస్ సీజన్ లో కానీ లేదంటే సంక్రాంతి తర్వాత కానీ బాలయ్య తన సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ మధ్య బాలయ్య నటించిన డిక్టేటర్ - ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచి దారుణంగా పరాభవం చవి చూశాయి. దీంతో బాలయ్య ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇద్దరు యువ హీరోల సినిమాలు ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కి వస్తున్నాయని అనౌన్స్ చేయడంతో తన సినిమాని సంక్రాంతి ముందు కానీ, తర్వాత కానీ రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు సినిమా సర్కిల్ లో గుసగుసలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.