Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సోనాల్ తో బాలయ్య స్టెప్పులు

By:  Tupaki Desk   |   1 Sep 2019 6:53 AM GMT
ఫోటో స్టొరీ: సోనాల్ తో బాలయ్య స్టెప్పులు
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె యస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనాల్ గతంలో 'లెజెండ్'.. 'డిక్టేటర్' చిత్రాల్లో బాలయ్యతో కలిసి నటించింది. బాలయ్యతో జోడీ కట్టడం సోనాల్ కు ఇది ముచ్చటగా మూడోసారి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటు బాలయ్య సోనాల్ పైన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను చిత్రీకరించారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అనే సంగతి తెలిసిందే. ఆయన స్వరపరిచిన ఓ బాణీకి జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. వినాయక చవితికి కానుక అన్నట్టుగా ఈ సినిమా నుండి ఒక స్టిల్ ను రిలీజ్ చేశారు. పైన కనిపిస్తున్న స్టిల్ ఈ పాటలోనిదే. బాలయ్య ఈ స్టిల్ లో యమా స్టైలిష్ గా ఉన్నారు. ప్రింటెడ్ కలర్స్ ఉండే హాఫ్ షర్టు.. జీన్స్ ప్యాంట్.. కళ్ళకు గాగుల్స్.. వ్యాన్ డైక్ స్టైల్ గడ్డంతో ఓ సూపర్ డ్యాన్స్ పోజిచ్చారు. సోనాల్ కూడా బాలయ్య కు పోటీ అన్నట్టుగా బటన్లు వదిలేసిన షర్టు.. మైక్రో నిక్కర్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిలుచుంది. మెడలో సన్నటి చెయిన్లు.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ ధరించి గ్లామర్ ప్లస్ స్టైల్ రెండిటిని కలిపింది.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ తో పాటు వేదిక కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు.