Begin typing your search above and press return to search.

బాలయ్య ఖాతాలో ఇంకో రికార్డు

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:05 AM IST
బాలయ్య ఖాతాలో ఇంకో రికార్డు
X
బాలయ్య కొత్త సినిమా 'లయన్‌' 40 రోజుల కిందట రిలీజవడం.. థియేటర్ల నుంచి అదృశ్యమైపోవడం కూడా జరిగిపోయింది. కానీ దీని కంటే ఏడాది ముందు రిలీజైన బాలయ్య సినిమా 'లెజెండ్‌' మాత్రం ఇప్పటికీ ఓ థియేటర్లో ఆడుతుండటం విశేషం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆ సినిమా 500 రోజుల దిశగా పరుగులు పెడుతోంది. మొదట ఆర్వేటి థియేటర్లో 56 రోజులాడిన లెజెండ్‌ ఆ తర్వాత అర్చన థియేటర్‌కు షిఫ్ట్‌ అయింది. అప్పట్నుంచి ఏకధాటిగా ఆడుతూనే ఉంది. ఈ థియేటర్లో 'లెజెండ్‌' 275 రోజుల వేడుక చేయడం.. ఆ ఫంక్షన్‌కు బాలయ్య, బోయపాటి శ్రీను తదితరులు హాజరవడం తెలిసిందే.

అర్చన థియేటర్‌తో పాటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మినీ శివ థియేటర్లో 'లెజెండ్‌' 400 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోగా.. ఆ వేడుకను ఎమ్మిగనూరులోనే చేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ సినిమా రెండు థియేటర్లలో 400 రోజులాడిన రికార్డు బాలయ్యకే సొంతం. ఐతే ఆ రికార్డు అవ్వగానే ఎమ్మిగనూరులో 'లెజెండ్‌' ప్రదర్శన ఆగిపోయింది. కానీ ప్రొద్దుటూరులో మాత్రం ఇంకా సినిమా ఆడుతూనే ఉంది. షిఫ్ట్‌ తర్వాత అర్చన థియేటర్లో ఈ సినిమా 400 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం విశేషం. 500 రోజుల రికార్డు తర్వాతైనా 'లెజెండ్‌' జర్నీకి 'ది ఎండ్‌' పడుతుందో లేదో చూడాలి మరి.