Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ టాప్ 6 తో బాల‌య్య హంగామా

By:  Tupaki Desk   |   2 Jun 2022 10:33 AM GMT
అన్ స్టాప‌బుల్ టాప్ 6 తో బాల‌య్య హంగామా
X
స్టార్ హీరోల్లో నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నాని, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రానా ద‌గ్గుబాటి వంటి స్టార్స్ రియాలిటీ షోస్ చేస్తూ బుల్లితెర‌పై కూడా త‌మ స‌త్తాని చాటుతున్నాయి. అయితే ఈ లీగ్ లోకి స‌డ‌న్ గా అన్ స్టాప‌బుల్ ట్రైన్ తో ఎంట్రీ ఇచ్చేసి అంద‌రి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టారు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. తొలి సారి 'ఆహా' ఓటీటీ కోసం నంద‌మూరి బాల‌య్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకె' పేరుతో సెల‌బ్రిటీ టాక్ షోని ప్రారంభించి ఓటీటీ చ‌రిత్ర‌లోనే ఈ షోని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టారు.

ఈ షోలో నంద‌మూరి బాల‌య్య ..కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు నుంచి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌ర‌కు ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల‌తో ప్ర‌త్యేక చిట్ చాట్ ల‌ని నిర్వ‌హించి అద‌ర‌గొట్టేశారు. మ‌హేష్ బాబు స్పోష‌ల్ ఇంట‌రాక్ష‌న్ తో బాల‌య్య అన్ స్టాప‌బుల్ టాక్ షో తొలి సీజ‌న్ విజయ‌వంతంగా పూర్త‌యింది. త్వ‌ర‌లో సీజ‌న్ 2ని కూడా ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఇదిలా వుంటే ఇటీవ‌ల పాపుల‌ర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడ‌ల్ షో పేరుతో సింగింగ్ షోని ప్రారంభించింది. దీనికి జ‌డ్జెస్ గా సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్‌, సింగ‌ర్ శ్రీ‌రామ్‌, హీరోయిన్ నిత్యామీన‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ షోకు స్పెష‌ల్ గెస్ట్ గా నంద‌మూరి బాల‌య్య ఎంట్రీ ఇచ్చారు. ఆరుగురు కంటెస్టెంట్ ల‌తో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకె పేరుతో తాజా షో స్ట్రీమింగ్ కాబోతోంది.

జూన్ 10 న రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా 'ఆహా' వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. 'సింహ మంటీ చిన్నోడే వేట‌కొచ్చాడే అనే పాట‌కు స్టెప్స్ వేస్తూ బాల‌య్య షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. క్యాజువ‌ల్ గా రాలేదూ.. కాంపిటీష‌న్ కి వ‌చ్చా... వైల్డ్ కార్డ్ ఎంట్రీని నేనిక్క‌డా.. అంటూ బాల‌య్య త‌న మార్కు డైలాగ్ తో స్టేజ్ పై అద‌ర‌గొట్టేశారు. తాజా ఎపిసోడ్ లో త‌మ‌న్‌, నిత్యామీన‌న్‌, శ్రీ‌రామ్ తో పాటు ఫేమ‌స్ సింగ‌ర్ మాల్గుడి శుభ కూడా ఎంట్రీ ఇచ్చారు. శ్రీ‌రామ‌చంద్ర యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

ఈ షోలో పోటీప‌డిన కంటెస్టెంట్ లతో స‌ర‌దాగా ముచ్చ‌టించిన బాల‌య్య ఓ సింగ‌ర్ పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లిచేసుకోబోతున్నావ‌ట‌... పెళ్లెప్పుడూ అని అడ‌గ‌ను.. ఎందుక‌య్యా పెళ్లి అని అడుగుతాను అని పంచ్ వేసి న‌వ్వించాడు. ఆ త‌రువాత శ్రీ‌రామ‌చంద్ర 'భార్య‌ను ఏమార్చ‌డం ఎలా? అనే బుక్ ని చూపించాడు. ఈ ఒక్క‌బిట్టు మాత్రం మా ఇంట్లో టెలీకాస్ట్ కాకుండా చూడండి ప్లీజ్ అని బాల‌య్య చ‌మ‌త్క‌రించాడు.

ఒక‌వేళ వ‌సుంద‌ర‌గారు చూస్తే ద‌బిడిదిబిడే అనేశాడు బాల‌య్య‌. ఇక షో మ‌ధ్య‌లో బాల‌య్య క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి తీసుకెళుతుంటే ఆలీబాబా న‌ల‌భై దొంగ‌ల్లాగా ఈ న‌లుగురు న‌న్నెక్క‌డికి తీసుకెళుతున్నారు అన‌గానే వెన‌కాలే వున్న నిత్యామీన‌న్ గొల్లున న‌వ్వేసింది. బాల‌య్య స‌ర‌దా స‌ర‌దా పంచ్ ల‌తో స‌ర‌దాగా సాగిన తాజా ఎపిసోడ్ ఆహాలో జూన్ 10న రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కానుంది.