Begin typing your search above and press return to search.
బాలయ్య చేతుల మీదుగా తారక్ బర్త్ డే
By: Tupaki Desk | 22 Feb 2016 6:57 PM ISTఏంటో ఉన్నట్లుండి నందమూరి తారకరత్నకు మంచి రోజులు వచ్చేసినట్లున్నాయి. ఓ క్రేజీ మూవీలో విలన్ గా అవకాశం అందుకున్నాడు. పైగా ఈసారి అతడి పుట్టిన రోజును అందరూ గుర్తుంచుకుని అతడికి విషెస్ చెబుతూ.. వేడుకలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ తమ్ముడికి స్పెషల్ గా శుభాకాంక్షలు చెప్పగా.. బాలయ్య అయితే నేరుగా అబ్బాయి కోసం కేక్ సైతం కట్ చేయడం విశేషం.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో తారకరత్న విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సాయి కొర్రపాటి తారకరత్నకు పత్రికా ప్రకటనల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు డమే కాదు.. ఈ సినిమా సెట్లో పుట్టిన రోజు వేడుక ఏర్పాటు చేశాడు. సాయి కొర్రపాటికి బాలయ్య క్లోజ్ కూడా కావడంతో ఈ వేడుకకు ఆయన్నే ముఖ్య అతిథిగా పిలిచాడు.
బాలయ్య వచ్చి అబ్బాయితో కలిసి కేక్ కట్ చేసి ఆ వేడుకు కళ తెచ్చాడు.ఈ వేడుకలో సాయి కొర్రపాటితో పాటు సీనియర్ నటి సుమలత కూడా పాల్గొనడం విశేషం. బాబాయి వచ్చి ఇలా తన బర్త్ డే వేడుక చేస్తే ఇక తారకరత్న ఆనందానికి అంతేముంటుంది చెప్పండి. ఒడుదొడుకులతో సాగుతున్న తారకరత్న కెరీర్ ఈ సినిమాతో అయినా గాడిన పడుతుందేమో చూడాలి.