Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ కమింగ్.. గెట్ రెడీ

By:  Tupaki Desk   |   7 Sep 2017 5:05 AM GMT
మోక్షజ్ఞ కమింగ్.. గెట్ రెడీ
X
తండ్రి వారసత్వం కొడుకు అందిపుచ్చుకోవడం అనేది సాధారణమే. కానీ సినిమా ఇండస్ట్రీలో వారసత్వానికి ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ విషయంలో ఇది మరింత ఎక్కువ. వారి రాకపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ల సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల్లోనూ ఆసక్తి ఉంటుంది. ఆ విధంగా నందమూరి అభిమానులు బాగా వెయిట్ చేస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రన్స్ కోసమే.

అభిమానుల కోరిక నెరవేరుస్తూ మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడంటూ అభిమానులందరికీ బాలకృష్ణ ఓ తీపికబురు వినిపించాడు. మోక్షజ్ఞ నటించే తొలి సినిమా వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభమయ్యే అవకాశముందని.. జూన్ 2018లో ఎంట్రీ ఇస్తాడని బాలయ్య స్వయంగా ప్రకటించేశాడు. ఈలోగా హీరోగా షైన్ కావడానికి అవసరమైన అన్ని క్వాలిటీలు పెంచుకోవడంపై మోక్షజ్ఞ కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికైతే ఏ సినిమాతో రంగప్రవేశం చేయనున్నాడు.. ఎలాంటి కథాంశాన్ని ఎంచుకుంటున్నారు.. ఎవరి డైరెక్షన్ లో యాక్ట్ చేయబోతున్నాడు అన్నవాటిపై బాలకృష్ణ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వన్స్ మోక్షజ్ఞ అన్ని అంశాల్లోనూ పర్ ఫెక్ట్ అనిపించిన వెంటనే సినిమా అనౌన్స్ చేసే అవకాశముంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో న్యూ జనరేషన్ నుంచి ఒక్కొక్కరుగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సినిమాల్లో నిలదొక్కుకోగా... అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ అదే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. ఇక నందమూరి కుటుంబం నుంచి రాబోయేది మోక్షజ్ఞ అనేది అందరికీ తెలిసిందే. కాకుంటే ఆ మాట బాలకృష్ణ నోట అఫీషియల్ గా బయటకు వచ్చింది. సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు గెట్ రెడీ!!