Begin typing your search above and press return to search.

10 కోట్లు ఇమ్మంటున్న సీనియర్ హీరో

By:  Tupaki Desk   |   11 Feb 2017 12:05 PM IST
10 కోట్లు ఇమ్మంటున్న సీనియర్ హీరో
X
నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్ పెంచారనే వార్త.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా బాలయ్య తన పారితోషికాన్ని పెంచలేదు. సాధారణంగా సినిమాకి రూ. 7 కోట్లు తీసుకునే ఈయన.. కొన్నేళ్లుగా ఇదే మొత్తాన్ని అందుకుంటున్నారు తప్ప.. ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయలేదు.

నిర్మాతలపై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకే తన పారితోషికం పెంచలేదు బాలయ్య. కానీ ఇప్పుడు బాలయ్య తన రెమ్యూనరేషన్ ను 10 కోట్లు చేశారట. గౌతమిపుత్ర శాతకర్ణితో భారీ విజయం అందుకోవడమే కాదు.. ఏకంగా 50 కోట్ల షేర్ ని రాబట్టారు బాలకృష్ణ. అంతే కాదు.. ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తాన్ని వసూలు చేయగలిగారు. దీంతో ఇకపై తన రెమ్యూనరేషన్ ను 10 కోట్లు చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య రేంజ్ ఉన్న హీరో ఈ మొత్తం అందుకోవడం సాధారణమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మాస్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలకృష్ణ నుంచి.. ఫ్యాన్స్ ఆశించే స్థాయిలో సినిమా వస్తే.. ఒక్క ఏరియా నుంచే ఈ కలెక్షన్స్ వచ్చేస్తాయి.