Begin typing your search above and press return to search.

బాలయ్య ఇచ్చిన సపోర్టు అమోఘం

By:  Tupaki Desk   |   10 July 2015 10:04 PM IST
బాలయ్య ఇచ్చిన సపోర్టు అమోఘం
X
బాహుబలికి టాలీవుడ్‌ హీరోలరంతా తమ సినిమాగా భావించి ప్రమోషన్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఓ గొప్ప విజువల్‌ ట్రీట్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. బాలయ్యబాబు అయితే మరో అడుగు ముందుకేసి ఈ సినిమా రిలీజ్‌ నుంచి ప్రతి విషయంలో అడ్డంకులు రాకుండా సాయం చేశారు. అందుకోసం తన పొలిటికల్‌ పవర్‌ను ఫుల్లుగా ఉపయోగించారని చెబుతున్నారు.

బాలయ్యబాబు ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఏపీలో చాలా విషయంలో చలాకీతనం చూపిస్తున్నారు. బాహబలి ఆడియోకి తిరుపతిలో పర్మిషన్‌ ఇప్పించింది బాలయ్యే. అలాగే సినిమా రిలీజ్‌ సందర్భంగా నిన్నంతా బెనిఫిట్‌ షోలు వేస్తే, వాటన్నిటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాయం చేసింది కూడా బాలయ్యే. ఏపీ, తెలంగాణలో భారీగా బెనిఫిట్‌ షోలు, వేకువ ఝాము షోలు వేశారు. వీటన్నిటికీ లైన్‌ క్లియర్‌ చేసింది బాలయ్య సాయమేనని తెలుస్తోంది.

అంతేనా తనకి ఎంతో ఆప్తుడైన పంపిణీదారుడు బల్లారి సాయి కోసం బోలెడంత సాయం చేశాడు. సాయి లెజెండ్‌ చిత్రానికి ఒకానొక పెట్టుబడిదారుడు. అలాగే ప్రస్తుతం బాహుబలి చిత్రాన్ని పంపిణీ చేశారు. అందుకే బాలయ్య సాయం అనుకోనక్కర్లేదు. భారతదేశం గర్వించదగ్గ సినిమాకి ఇలా తలో చెయ్యి వేయాలనే అతడి తాపత్రయం.