Begin typing your search above and press return to search.

'భీమ్లానాయ‌క్‌' ఫ‌స్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదా?

By:  Tupaki Desk   |   21 Oct 2022 3:22 PM IST
భీమ్లానాయ‌క్‌ ఫ‌స్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదా?
X
మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, సిజ్జు క‌లిసి న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , రానాల క‌ల‌యిక‌లో `భీమ్లా నాయ‌క్‌` పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌గా సాగ‌ర్ కె. చంద్ర ఈ రీమేక్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు . ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనూమ్య విజ‌యాన్ని సాధించింది.

అయితే ఈ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాద‌ని తెలుస్తోంది. ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. త‌నే ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట‌పెట్టారు. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్యంహ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె`. సీజ‌న్ వ‌న్ బ్లాక్ బస్ట‌ర్ హిట్ కావ‌డంతో రీసెంట్ గా సీజ‌న్ 2ని మొద‌లు పెట్టారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సీజ‌న్ 2 మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ల‌ తో మొద‌లైంది.

ఫ‌స్ట్ ఎపిసోడ్ ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం, ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అదే జోష్ తో రెండ‌వ ఎపిసోడ్ ని తాజాగా రివీల్ చేశారు. ఇందులో `భీమ్లానాయ‌క్‌` ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని బాల‌య్య ప్ర‌శ్రించిన తీరు `భీమ్లానాయ‌క్‌` తెర వెనుక జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీని బ‌య‌ట‌పెట్టేసింది. ఈ మూవీ తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు ఫ‌స్ట్ ఛాయిస్ ఎవ‌రు? .. ఎందుకు మారింద‌నే విష‌యాల్ని తాజాగా ఈ షోలో ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ వెల్ల‌డించారు

అన్ స్టాప‌బుల్ షోలో బాల‌య్య `భీమ్లానాయ‌క్‌` రీమేక్ పై ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశారు. `భీమ్లానాయ‌క్‌` ఫ‌స్ట్ ఛాయిస్ ఎవ‌రు? అని బాల‌య్య ప్ర‌శ్నిస్తే.. ఫ‌స్ట్ ఛాయిస్ మీరే సార్ అని స‌మాధానం చెప్పాడు. అంతే కాకుండా మేము మీ చుట్టూ తిరిగి హీరోగా మిమ్మ‌ల్ని అడిగిన త‌రువాత సినిమా చూసి ఈ క‌థ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు చేస్తే బాగుంటుంద‌ని మీరే క‌దా చెప్పింది` అని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు. నిర్మాత నాగ‌వంశీ.

ఈ విష‌యం బ‌య‌టికి రావ‌డంతో `భీమ్లానాయ‌క్‌` బాల‌య్య చేస్తే మ‌రో స్థాయిలో వుండేద‌ని అభిమానులు, నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. ఇన్నీ తెలిసిన బాల‌య్య `భీమ్లానాయ‌క్‌` వెన‌కున్న అస‌లు స్టోరీని ఇలా ఇప్ప‌డు ఎందుకు బ‌య‌ట‌పెట్టించారో ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేద‌ట‌. ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఈ విష‌యం తెలియాల‌నా? లేక తానే ఈ మూవీని ప‌వ‌న్ కు స‌జెస్ట్ చేశాన‌ని చెప్ప‌డం కోస‌మా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.