Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్ కి మళ్లీ బ్రేక్

By:  Tupaki Desk   |   10 Aug 2017 12:41 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ కి మళ్లీ బ్రేక్
X
నందమూరి వారసుడిగా ఇటు సినిమా రంగంలో అటు రాజకీయాల్లో విజయాలను అందుకుంటున్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించాడు. వయసుతో సంబంధం లేకుండా తనదైన పాత్రలను చేస్తూ.. అలరిస్తున్నాడు. అయితే గత కొన్ని కొన్నేళ్లుగా ఆయన తెరకెక్కిస్తానని చెబుతున్న తన తండ్రి బయోపిక్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు బాలయ్య.

తెలుగుజాతి గర్వించదగ్గ పేరు సంపాదించిన నందమూరి తారక రామారావు గారు పాత్ర తానే చేస్తానని చాలా సార్లు చెప్పారు బాలయ్య. కానీ అందుకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు ఆయనకు దొరక్కపోవడం వల్ల ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతానికి బయోపిక్ ని పక్కనబెట్టారట. కానీ గత నెలలో ఎన్టీఆర్ బయోపిక్ తానే తీస్తానని చెప్పిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పాటను కూడా రిలీజ్ చేశాడు. మారి వర్మతో చేతులు కలిపే ఆలోచనలో ఉన్నారా బాలయ్య బాబు అని పుకార్లు కూడా వచ్చాయి.

కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ మరియు సన్నిహితులు వర్మతో అస్సలు తీయవద్దని సలహాలిచ్చారట. ఎందుకంటే రాము ప్రస్తుతం అన్ని ప్లాప్స్ సినిమాలే తీస్తున్నారు. జనాల్లో కూడా అంతగా ఆయన సినిమాలకు ఆదరణ లేదు. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఓ రేంజ్ లో ఉండాలని కోరుతూ రామూతో వద్దన్నారట. కానీ బాలయ్య ఫెయిల్యూర్స్ లో ఉన్న దర్శకులు చెప్పిన కథ బావుంటే ఒకే చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలయ్య ఇంకా డిసైడ్ కాలేదట. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగిసిన తర్వాత కొంతమంది సీనియర్ దర్శకులతో నేటి కానున్నారని సమాచారం.