Begin typing your search above and press return to search.

మరో 'పైసా వసూల్‌' కన్ఫర్మ్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   27 Oct 2020 6:20 PM IST
మరో పైసా వసూల్‌ కన్ఫర్మ్‌ అయ్యింది
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు పూర్తి చేయబోతున్నారు. బోయపాటి తర్వాత బాలయ్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు. బి గోపాల్‌ పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. కాని అంతకు ముందు పూరి జగన్నాధ్‌ తో ఒక సినిమాను బాలయ్య చేస్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలో వీరిద్దరు కథ విషయమై చాలా సార్లు మాట్లాడుకున్నారంటూ మీడియా సర్కిల్స్‌ ద్వారా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయ్యే లోపు విజయ్‌ దేవరకొండతో సినిమాను పూరి పూర్తి చేసే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వేసవి వరకు బాలయ్య.. పూరిల కాంబోలో మరో మూవీ పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన పైసా వసూల్‌ మూవీ నిరాశ పర్చింది. ఆ సమయంలోనే పూరితో మరో సినిమాకు బాలయ్య ఓకే చెప్పాడు. బాలయ్య ఒక్కసారి సినిమా చేద్దాం అంటూ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతాడు. అందుకే పూరితో మరో సినిమాను చేసేందుకు ఇప్పుడు రెడీ అయ్యాడు.

పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. వచ్చే నెలలో షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో పూరి తర్వాత సినిమా చిరంజీవితో లేదా మహేష్‌ బాబుతో అన్నారు. వారిద్దరితో కాకుండా బాలయ్యతో మళ్లీ సినిమాకు పూరి రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు బలంగా వస్తున్నాయి. ఈ కాంబో విషయమై గతంలో కూడా వార్తలు వచ్చాయి. కాని ఈసారి మాత్రం కాస్త బలంగా వినిపిస్తున్నాయి. పూరి ఈ విషయమై ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.