Begin typing your search above and press return to search.

మనవడితో బాలయ్య సర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 9:54 AM IST
మనవడితో బాలయ్య సర్‌ ప్రైజ్‌
X
నందమూరి ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఎన్టీఆర్‌’. నందమూరి తారక రామారావు బయోపిక్‌ గా రూపిందిన ఈ చిత్రంకు క్రిష్‌ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్‌ గా బాలకృష్ణ నటించగా, ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ఎంతో మంది నటీ నటులు నటించారు. పెద్ద ఎత్తున ఈ చిత్రంలో పలువురు నటీనటులు కనిపించనున్న నేపథ్యంలో చిత్రంపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రను ఎవరు చేస్తారా అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలయ్య పాత్రను మోక్షజ్ఞ చేస్తాడని కొందరు - ఎన్టీఆర్‌ పోషించబోతున్నాడని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య పెద్దయ్యాక పాత్ర సంగతేమో కాని - చిన్నప్పటి పాత్రను మాత్రం ఆయన చిన్న మనవడు పోషించాడట. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి కొడుకును ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బాల బాలకృష్ణుడిగా చూపించబోతున్నారు. నెలల బాలుడే అయినా బాగా నటించాడు అంటూ నిన్న ఆడియో విడుదల సందర్బంగా బాలయ్య మనవడి ముచ్చట చెబుతూ మురిసి పోయాడు. ఇక బాలయ్య పెద్దయినాక పాత్రను ఎవరు చేశారనే విషయంపై క్లారిటీ లేదు. అసలు బాలయ్య పెద్దయ్యాక పాత్ర ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు.