Begin typing your search above and press return to search.

గోపిచంద్ తో NBK షెడ్యూల్ డేట్ ఇదే

By:  Tupaki Desk   |   10 April 2022 11:30 PM GMT
గోపిచంద్ తో NBK షెడ్యూల్ డేట్ ఇదే
X
స‌మ‌కాలీన స్టార్ల‌తో పోలిస్తే తాను ఎందులోనూ త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఇటీవ‌ల స్టార్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే రేసులో తాను సైతం అంటూ దూసుకెళుతున్నారు ఎన్.బి.కే. ఇటీవ‌ల `అఖండ` సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా మూడు నాలుగు ప్రాజెక్టులు బాల‌య్య‌ క్యూలో ఉన్నాయి.

ఏప్రిల్ 18 నుంచి గోపిచంద్ మ‌లినేనితో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇది 45 రోజులు సుదీర్ఘ షెడ్యూల్. ఈ భారీ షెడ్యూల్ లో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారు. ముఖ్యంగా బాల‌య్య పోర్ష‌న్స్ అన్నీ ఆల్మోస్ట్ పూర్తి చేసేస్తార‌ట‌. ఆ త‌ర్వాత ఎన్.బి.కే త‌న త‌దుప‌రి చిత్ర ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారు. మొత్తానికి రావిపూడితో ప్రాజెక్ట్ కోసం గోపిచంద్ మ‌లినేనికి డెడ్ లైన్ విధించార‌ని అర్థ‌మ‌వుతోంది.

త‌దుప‌రి ఆదిత్య 369 సీక్వెల్ కోసం అనీల్ రావిపూడికి కూడా డెడ్ లైన్ విధిస్తారేమో చూడాలి. అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 నిర్మాణానంత‌ర ప‌నుల్ని సాగిస్తున్నారు. ఇక‌ ఎన్.బి.కే న‌ట‌వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్ప‌టి నుంచే బాల‌య్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ త‌న‌కు ఎంతో కీల‌క‌మైన‌ది.

త‌న‌యుడిని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో లాంచ్ చేయాల‌న్న ఆలోచ‌న కూడా బాల‌య్య బాబుకి ఉంది. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చ‌ర్చ సాగింది. ఆదిత్య 369 సీక్వెల్ లో అత‌డు న‌టిస్తాడ‌ని బాల‌య్య అతిథిగా క‌నిపిస్తార‌ని.. `ఆదిత్య 999 మ్యాక్స్` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని కూడా ప్ర‌చార‌మైంది. ఈ మూవీ ఎన్.బి.కే లైఫ్ లోనే స్పెష‌ల్ మూవీ కానుంది. అందువ‌ల్ల ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేమ‌ని గుస‌గుస వినిపిస్తోంది.