Begin typing your search above and press return to search.

బెంట్లీ కారిచ్చిన బాలయ్య కూతుళ్ళు

By:  Tupaki Desk   |   12 Jun 2017 7:22 AM GMT
బెంట్లీ కారిచ్చిన బాలయ్య కూతుళ్ళు
X
తమ తండ్రులకు ఖరీదైన కారులు గిఫ్ట్ ఇవ్వడం అనేది సెలబ్రిటీ కొడుకుల్లో కూతుళ్ళలో ఒక మాంచి ఆనవాయితీగా తయారైంది. గతంలో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి రోల్స్ రాయిస్ ఇచ్చాడు. అలాగే వరుణ్‌ తేజ్ కూడా నాగబాబుకు బిఎండబ్లూ కొనిచ్చాడు. విష్ణు మంచు కూడా మోహన్ బాబుకు రోల్స్ రాయిస్ గిఫ్టిచ్చాడు. ఇప్పుడు ఈ లిస్టులో బాలయ్య కూతుళ్లిద్దరూ జాయినయ్యారు.

నిన్న నందమూరి బాలకృష్ణ తన 57వ పుట్టినరోజు వేడుక జరుపుకున్న సందర్భంలో.. ఆయన కూతుళ్ళు.. అల్లుళ్ళు భార్య కొడుకు పోర్చుగల్ దేశానికి వెళ్ళి మరీ ఆయనతో కేక్ కటింగ్ చేయించారు. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు బాలయ్యకు ఆ సందర్భంగా ఒక కార్ తాళాలను గిఫ్ట్ ఇచ్చారు. 4 కోట్లు ఖరీదు చేసే బెంట్లీ కాంటినెంటల్ కారును ఇప్పుడు కూతుళ్ళిద్దరూ కలసి డాడ్ కు గిఫ్టిచ్చారులే. ఆ కార్‌ తాళాలే అవి. ఒక ప్రక్కన సినిమాల్లో రారాజుగా కొనసాగుతూ మరోప్రక్కన రాజకీయాల్లో కూడా సందడి చేస్తున్న బాలయ్యకు.. ఖచ్చితంగా ఈ గిఫ్ట్ మరువలేనిది.

ఇకపోతే ఈ సందర్భంగా పోర్చుగల్ లో షూటింగ్ చేస్తున్న ''పైసా వసూల్'' టీమ్ కు కూడా బాలయ్య కూతుళ్ళు చాలా పెద్ద గ్రాండ్ పార్టీ ఇచ్చారట. ఆ పార్టీ స్థాయిని చూసి యునిట్ అంతా ఆశ్చర్యపోయారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/