Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ : గౌతమిపుత్రుడు శాటిలైట్ ?
By: Tupaki Desk | 12 Aug 2016 6:19 PM ISTనందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని.. ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. బాలయ్య వందో సినిమా అనే పాయింట్ మాత్రమే కాకుండా.. తెలుగు చరిత్రకు సంబంధించిన సినిమా కావడంతో.. చాలానే ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణికి శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయిపోయిందనే న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఏకంగా 9.15 కోట్ల రూపాయలు చెల్లించి మాటీవీ ఛానల్ శాటిలైట్స్ ను కొనుగోలు చేయడం సంచలనమే అని చెప్పాలి. బాలయ్య సినిమాల్లో ఇదే అతి పెద్ద రికార్డ్. పీరియాడికల్ మూవీకి ఇంత భారీ డీల్ రావడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే. అసలు శాతకర్ణి షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతీ విషయాన్ని పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తుండగా.. ఒక విషయంలో మాత్రం నిర్మాతలు అంత స్పీడ్ చూపించలేదు.
అదే సినిమా బిజినెస్ పూర్తి చేయడం. సినిమా అనౌన్స్ చేయగానే బిజినెస్ డీల్స్ మాట్లాడేసుకునే రోజులు అయినా.. మూవీపై ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు ఆ జోలికే వెళ్లలేదు. పైగా మూవీ రిలీజ్ కి ఇంకా నాలుగు నెలలు టైమ్ ఉండడంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ.. ఆడియన్స్ లో శాతకర్ణి క్రియేట్ చేస్తున్న బజ్ కారణంగా.. ఆఫర్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చేస్తుండడం విశేషం.