Begin typing your search above and press return to search.

మహేష్‌ ను కొట్టేసిన బాలయ్య

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:37 PM IST
మహేష్‌ ను కొట్టేసిన బాలయ్య
X
ఓవర్సీస్‌ కలెక్షన్లలో చాలా వీక్‌ గా ఉండేవాడు నందమూరి బాలకృష్ణ. మొన్నటి దాకా ఆయనకు అమెరికాలో కనీసం హాఫ్ మిలియన్ సినిమా కూడా లేదంటే ఆశ్చర్యమే. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘లెజెండ్’ కూడా అక్కడ 4 లక్షల డాలర్లకు కాస్త పైన వసూలు చేసిందంతే. బాలయ్య చివరి సినిమా ‘డిక్టేటర్’ను దాదాపు వంద స్క్రీన్లలో రిలీజ్ చేస్తే.. రిలీజ్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం చరిత్రనంతా చెరిపేసింది. అమెరికాలో ఈ సినిమా అసాధారణ వసూళ్లు రాబట్టింది. 1 మిలియన్ కాదు.. ఏకంగా 1.5 మిలియన్ మార్కునే దాటేసింది. యుఎస్ బాక్సాఫీస్‌లో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ల లిస్టులో టాప్-10లోనూ చోటు సంపాదించింది.

తాజాగా మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కలెక్షన్లను ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దాటేయడం విశేషం. ఎస్వీఎస్సీ 1.635 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. బాలయ్య సినిమా వసూళ్లు 1.65 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్థానం ఎనిమిది. శాతకర్ణి కంటే ముందు జనతా గ్యారేజ్ 1.8 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉంది. దాని కంటే ముందు అత్తారింటికి దారేది (1.89 డాలర్లు) ఉంది. ఐతే ఈ వీకెండ్ తర్వాత కలెక్షన్లు బాగా డౌన్ అయిపోతాయి. పైగా రాబోయే వీకెండ్లో ‘నేను లోకల్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది. కాబట్టి ఫుల్ రన్లో 1.7 మిలియన్ డాలర్ల దగ్గర ‘శాతకర్ణి’ ఆగిపోవచ్చేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/