Begin typing your search above and press return to search.

క్లారిటీ: ఆ రోజు బాలయ్య నన్ను కొట్టలేదు

By:  Tupaki Desk   |   14 Jan 2017 8:52 AM GMT
క్లారిటీ: ఆ రోజు బాలయ్య నన్ను కొట్టలేదు
X
బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ లో చోటు చేసుకున్న ఒక సంఘటనపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చ అంతాఇంతా కాదు.రిలీజ్ రోజు తెల్లవారుజామున భ్రమరాంబ థియేటర్లో వేసిన స్పెషల్ షోకు బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమాని ఒకరు బాలకృష్ణతో ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించటం.. ఆ సందర్భంగా అతన్ని బాలయ్య కొట్టారని.. తోసేశారని.. అతని సెల్ ఫోన్ విసిరేసినట్లుగా వార్తలు వచ్చాయి.దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా బాధితుడిగా పేర్కొంటున్న యువకుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. తన మాటలతో కూడిన వివరణను.. అసలు ఆ రోజేం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో చెప్పిందేమిటంటే..

తనను బాలయ్య కొట్టారంటూ సోషల్ మీడియాలోనూ.. వెబ్ సైట్లలో జరుగుతున్న ప్రచారం తప్పని.. అసలేం జరిగిందో చెప్పుకొచ్చారు. ఆ రోజు షోకు వెళ్లానని.. బాలయ్యను చూసిన సంతోషంలో ఆయన దగ్గరకు వెళ్లి ఫోటో తీసుకునే తొందర్లో.. ఆయన కాలిని తాను తొక్కినట్లు చెప్పాడు. ఈ సంద్భంగా తనను పక్కకు నెట్టారని.. ఆ సందర్భంగా తన ఫోన్ కిందపడిందే తప్పించి.. బాలయ్య తనను ఏమీ అనలేదన్నారు. తనదే తప్పుగా చెప్పిన ఆ యువకుడు.. ఆ తర్వాత బాలయ్యతో మరో షోకు వెళ్లానని.. ఆ సందర్భంగా ఆయనతో తాను ఫోటోదిగినట్లుగా చెప్పాడు. బాలయ్యవ్యతిరేక శక్తులు చౌకబారు ప్రచారాలు చేస్తున్నారన్నఅతడు.. చివర్లో జై బాలయ్య అంటూ ముక్తాయించాడు.