Begin typing your search above and press return to search.

బాలయ్య కష్టం రోజుకు 5 గంటలు

By:  Tupaki Desk   |   1 Sep 2019 1:02 PM GMT
బాలయ్య కష్టం రోజుకు 5 గంటలు
X
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు. ఇప్పటికే తన 105 సినిమాకు సంబంధించిన పిక్స్ ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఫ్రెంచ్ కట్ గడ్డంతో సన్నబడిన దేహంతో అసలు చూస్తున్నది బాలయ్యనేనా అని అభిమానులే ఆశ్చర్యపోయేలా ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి. ఇంత తక్కువ టైంలో బాలకృష్ణ ఇలాంటి లుక్ లోకి ఎలా వచ్చాడా అనే అనుమానం కలగడం సహజం.

దానికి నిర్మాత సి కళ్యాణ్ క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం బాలయ్య రోజు ఉదయం సాయంత్రం జిమ్ లో 5 గంటల పాటు పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తున్నారట. అందుకే ఇంత లేట్ ఏజ్ లోనూ ఇంత గ్లామర్ గా కనిపిస్తున్నారని ఓపెన్ చేశారు. అయితే ఇందులో మరో మాస్ అవతారం ఉంటుందని రౌడీ ఇన్స్ పెక్టర్ రోజులను గుర్తుకు తెస్తుందని ఇంకాస్త ఊరిస్తున్నారు కళ్యాణ్.

అది డ్యూయల్ రోలా లేక రెండు షేడ్స్ ఉన్న ఒకే పాత్రా అనే క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచారు. ఇప్పుడున్న స్పీడ్ లో షూటింగ్ కనక కొనసాగిస్తే బాలయ్య ఈజీగా సంక్రాంతి రేస్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న నేపధ్యంలో బరిలో దిగుతారా లేదా అనే ప్రస్తుతానికి చెప్పలేం. ఇప్పుడీ సినిమాకు రూలర్ - క్రాంతి అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఏది ఫైనల్ అవుతుందో తెలియడానికి కొంత టైం పట్టొచ్చు