Begin typing your search above and press return to search.

మరోసారి మంచి మనసును చాటుకున్న బాలయ్య!

By:  Tupaki Desk   |   1 May 2020 4:45 PM GMT
మరోసారి మంచి మనసును చాటుకున్న బాలయ్య!
X
కరోనా పేరు చెబితేనే దేశం చిగురుటాకులా వణుకుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై భారీ ప్రభావం చూపింది. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధన మేరకు.. దేశంలో రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడిక్కడ స్థంభించి జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా మహామ్మారి పై పోరాటంలో ఎంతో మంది వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ శక్తి మించి పనిచేస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఈ వైరస్ మహామ్మారిపై సీనియర్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ స్పందించి.. ఇంతకు ముందు ప్రపంచంలో ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎపుడు చూడలేదు. కరోనా మహామ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవలే విధులు నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు. తాజాగా బాలకృష్ణ సమాజం కోసం, తన హిందూపూర్ నియోజకవర్గం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని కూడా చూసుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఆసుపత్రిలోని కరోనా పేషేంట్లతో మాట్లాడారు. అంతేగాక కరోనా ఉన్నంతకాలం పేషేంట్లకు ఉత్తమ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిని సందర్శించి రోగుల శ్రేయస్సు కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. ఇవే కాకుండా బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన ఆసుపత్రిలోని విధులు నిర్వహిస్తున్న 400మంది హౌస్ కీపింగ్ సభ్యులకు విరాళం అందించారు. ఆసుపత్రి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.