Begin typing your search above and press return to search.
బాలయ్య రిటైర్మెంట్ కు రెఢీ అవుతున్నారా?
By: Tupaki Desk | 15 Aug 2015 2:36 PM ISTఆదరిస్తుంటే అలా కంటిన్యూ అయిపోవటం కొందరు చేసే పని. మరికొందరు అందుకు పూర్తిగా భిన్నం. మాంచి ఊపులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ చెప్పేసి వేరే పనిలో బిజీ అయిపోతుంటారు. ఇమేజ్ ఉన్నప్పుడు.. దాన్ని వదులుకోవటానికి అగ్రనటులు పెద్దగా ఇష్టపడరు. కానీ.. టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన బాలయ్య బాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్న బాలయ్య.. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ.. అక్కడి ప్రజలతో మమేకం కావటమే కాదు.. పలు ప్రాజెక్టుల మీద దృష్టిసారిస్తున్నారు. ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రజాప్రతినిధుల సర్వేలో సైతం అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యే లలో బాలయ్య మొదటి స్థానంలో నిలవటం గమనార్హం.
తన నియోజకవర్గంలోని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. తన వందో సినిమా పూర్తి చేసిన తర్వాత.. రాజకీయాల మీద దృష్టి సారిస్తానని చెప్పటం గమనార్హం. ప్రస్తుతం బాలకృష్ణ 99 సినిమా సెట్స్ మీద ఉంది. త్వరలో వందో సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు.
బాలయ్య తాజా ప్రకటనతో.. రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని పలువురు అబిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సినిమాలు.. రాజకీయాల మీద దృష్టి పెడుతున్న ఆయన.. మరో ఏడాది తర్వాత నుంచి రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. తన వందో సినిమా తర్వాత రాజకీయాల మీద దృష్టి పెట్టాలని భావిస్తున్న బాలకృష్ణ ఆలోచనలో మరో కోణం కూడా ఉంది.
తన వారసుడు మోక్షజ్ణను తెరంగేట్రం చేయించాలని భావిస్తున్న బాలయ్య.. తన రిటైర్మెంట్ ను.. కొడుకు ఎంట్రీని ఒకేసారి ప్రకటించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికీ తండ్రీ.. కొడుకులు కలిసి నటిస్తున్నా.. బాలయ్య మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రిటైర్ కావాలని భావించటం గమనార్హం.