Begin typing your search above and press return to search.

బాలయ్య మార్క్ డైలాగ్ తో #BB3 టీజర్ దుమ్ములేపిందిగా...!

By:  Tupaki Desk   |   9 Jun 2020 2:30 PM GMT
బాలయ్య మార్క్ డైలాగ్ తో #BB3 టీజర్ దుమ్ములేపిందిగా...!
X
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. బాలయ్య - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాసివ్ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కోసం ఒక టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 7.09 నిమిషాలకు #BB3 నుండి వారు చెప్పినట్లుగానే మాసివ్ టీజర్ వచ్చేసింది. ఫస్ట్ రోర్ పేరుతో వచ్చిన ఈ టీజర్ లో ''ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి... శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనే దానికి.. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రా.. అంటూ బాలయ్య తన మార్క్ డైలాగ్ తో అలరించారు. అంతేకాకుండా ఈ టీజర్ లో బాలయ్య పంచెకట్టుతో కోర మీసంతో అదరగొట్టాడనే చెప్పవచ్చు. బాలయ్య ఫ్యాన్స్ ఆయన ఎలా ఉండాలని కోరుకుంటారో అదే విధంగా ఉంది బాలయ్య లుక్. ఇక ఈ టీజర్ కి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవడంతో ఈ టీజర్ ఇంకో లెవెల్ కి వెళ్ళింది. ఇది చూస్తుంటే బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో షూటింగ్ చేసిన ఫైట్ తో ఈ టీజర్ ని రూపొందించినట్లుగా అర్థం అవుతోంది.

కాగా ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' 'లెజెండ్' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. ఇప్పుడు రిలీజైన టీజర్ లో కనిపిస్తుంది మరో పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య 'జగదేక వీరుని కథ' సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేసిన బాలయ్య ఇప్పుడు #BB3 సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశారనే చెప్పవచ్చు.