Begin typing your search above and press return to search.

బాల‌య్య కోసం బి.గోపాల్ పిలిచేస్తారేమో!

By:  Tupaki Desk   |   16 March 2020 2:30 PM GMT
బాల‌య్య కోసం బి.గోపాల్ పిలిచేస్తారేమో!
X
సౌత్ సీనియ‌ర్ హీరోయిన్ సిమ్ర‌న్ ప్ర‌తిభ గురించి.. సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు ద‌శాబ్ధం పైగానే సిమ్రాన్ తెలుగు చిత్ర సీమ‌ను ఏలింది. చిరంజీవి..బాల‌కృష్ణ‌..వెంక‌టేష్...నాగార్జున‌లతో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకుంది. ఒక‌రకంగా అప్ప‌ట్లో యూత్ ఐకన్ సిమ్రాన్. ఈ వెట‌ర‌న్ న‌టి ఇండ‌స్ట్రీ బెస్ట్ డాన్స‌ర్ గానూ సుప‌రిచితం. మెగాస్టార్ చిరంజీవి.. న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ తో పోటీ ప‌డి మ‌రీ డాన్సులతో మురిపించిన ట్యాలెంట్ త‌న‌ది. హీరోలే సిమ్రాన్ కాల్షీట్ల కోసం వేచి చూసేంత బిజీ నాయిక‌గా ఓ ఊపు ఊపేసింది.

ఇక కోలీవుడ్...మాలీవుడ్...బాలీవుడ్ చిత్రాల్లోనూ సిమ్రాన్ స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా త‌న ట్యాంలెంట్ ని దాదాపు అన్ని భాష‌ల‌కు చాటి చెప్పింది. అటుపై పైలెట్ దీప‌క్ బ‌గ్గాని వివాహం చేసుకున్న అనంత‌రం సినిమాల‌కు దూర‌మైంది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు రావ‌డంతో సెకెండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం త‌మిళ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ సిమ్రాన్ మంచి పాత్ర‌లు అంది పుచ్చుకుంటూ స‌త్తా చాటుతోంది.

అయితే తాజాగా సిమ్రాన్ కొత్త ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మిరుమిట్లు గొలిపే ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ చీరలో సిమ్ర‌న్ అద‌ర‌గొట్టింది. మేక‌ప్ వేశాక‌ ఆ ముఖంలో మ‌ళ్లీ హీరోయిన్ అయ్యే ఛాయిస్ ఉందేమోన‌న్న డౌట్ వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌ళ్లీ హీరోయిన్ గా న‌టిస్తుందా? అన్నంత అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సిమ్రాన్ వ‌య‌సు 40 దాటింది. కానీ ఇంకా థ‌ర్టీ ఏజే అన్న‌ట్లుగా క‌వ్వించేస్తోంది. అదిరే అందం.. క‌వ్వించే ఆహార్యంతో ఆక‌ట్టుకుంటోంది. మ‌రి టాలీవుడ్ అవ‌కాశాలు కోసం ఇలా వ‌య‌సును త‌గ్గించేస్తోందా? ఇలా త‌న‌ని చూస్తే కొర‌టాల‌.. సుకుమార్.. పూరి పిలిచి అవ‌కాశాలిచ్చేయ‌రు క‌దా? అన్న‌ట్టు స‌మ‌ర‌సింహా రెడ్డి ఫేం బి.గోపాల్ తిరిగి సిమ్ర‌న్ ని బ‌రిలో దించుతారా ఏం? అస‌లే బాల‌య్య‌తో సినిమా చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయిగా!!