Begin typing your search above and press return to search.
స్టైల్ స్టైల్ అంటున్న బాలయ్య
By: Tupaki Desk | 20 July 2015 12:58 PM ISTఎప్పుడూ నటన గురించి, ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటాడు బాలయ్య. మిగతా హీరోల్లా స్టైల్ ఫ్యాక్టర్ మీద పెద్దగా దృష్టిపెట్టడు. దాని గురించి మాట్లాడడు. ఐతే తన కొత్త సినిమా ‘డిక్టేటర్’ విషయంలో మాత్రం స్టైల్ ఫ్యాక్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు నందమూరి హీరో. ఈ మధ్య కాలంలో తానెప్పుడూ కనిపించనంత స్టైలుగా ఈ సినిమాలో కనిపిస్తానని బాలయ్య చెప్పాడు. లుక్ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడని.. ‘డిక్టేటర్’ తన లుక్ చూసి జనాలు ఆశ్చర్యపోతారని ఓ ప్రైవేటు కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులకు చెప్పాడు బాలయ్య.
లయన్ సినిమాలో మరీ లావుగా కనిపించి ప్రేక్షకుల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన బాలయ్య డిక్టేటర్ కోసం 12 కిలోల బరువు తగ్గడం విశేషం. టి.సుబ్బిరామిరెడ్డి అవార్డుల కార్యక్రమంలో బాలయ్యలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ ఫంక్షన్ కు సూటు బూటేసుకుని భలేగా తయారై వచ్చిన బాలయ్యను చూస్తే ‘డిక్టేటర్’లో స్టైల్ ఫ్యాక్టర్ కచ్చితంగా హైలైట్ అవుతుందనే అనిపిస్తోంది. రెండు నెలల కిందటే ముహూర్తం జరుపుకున్న ‘డిక్టేటర్’ సోమవారమే సెట్స్ పైకి వెళ్లనుంది. రామానాయుడు స్టూడియోలో జరిగే తొలి షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.