Begin typing your search above and press return to search.

బాలయ్య భలే టెక్నీషియన్స్ ని పట్టాడే

By:  Tupaki Desk   |   18 Nov 2017 11:30 PM GMT
బాలయ్య భలే టెక్నీషియన్స్ ని పట్టాడే
X
ఒక సినిమాను తెరకెక్కించేటపుడు ఒక స్ట్రాంగ్ కథ ఉంటె సరిపోదు. ఆ కథను తెరకెక్కించే వారు అలాగే సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తేనే సినిమా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ కూడా ఆలోచిస్తున్నాడట. బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహకాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా తీయబోతున్నట్లు బాల్లయ్య చెప్పనప్పటి నుండి ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కథ ప్రస్తుతం రెడీ అవుతోంది. ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ లోపు సినిమాను విడుదల చెయ్యాలని బాలయ్య ఆలోచిస్తున్నాడు. అయితే సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం చాలానే ఉంది. ఈ లోపు టెక్నీషియన్స్ విషయంలో ఒక క్లారిటీకి వస్తే ఒక పని ఆయిపోతుంది కదా అని రీసెంట్ గా తేజ - బాలయ్య చర్చించుకున్నారట.

అయితే బాలయ్య సూచన ప్రకారం తేజ సంగీత దర్శకుడిగా కీరవాణిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు కెమెరామెన్ గా రవి వర్మన్ ని ఫైనల్ చేశారట. తేజ కూడా ఇద్దరూ మంచి టెక్నీషియన్స్ అని త్వరలో వారిద్దరిని కలిసి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. చారిత్రాత్మక సినిమా కాబట్టి ముందే వారికి చెబితే వారి పనుల్లో వారు బిజీగా ఉంటారని బాలయ్య ఇద్దరిని ఒకే చేశారని సమాచారం.