Begin typing your search above and press return to search.

NBK-రానా మ‌ల్టీస్టార‌ర్.. నిప్పు- నీరు క‌లయిక‌!

By:  Tupaki Desk   |   7 April 2020 10:21 AM IST
NBK-రానా మ‌ల్టీస్టార‌ర్.. నిప్పు- నీరు క‌లయిక‌!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌-భ‌ళ్లాల దేవ రానా మ‌ల్టీస్టార‌ర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన `అయ్యప్పనుమ్‌ కోసియుమ్` రీమేక్ లో ఆ ఇద్ద‌రూ న‌టిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. రానా పాన్ ఇండియా స్టార్ కాబ‌ట్టి బిగ్ స్కేల్ లో చిత్రాన్ని నిర్మించాల‌ని స‌ద‌రు సంస్థ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వాస్త‌వానికి తొలుత ఇందులో రానా ఒక్క‌డి పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా బాల‌య్య కూడా యాడ్ అవుతున్నార‌ని క‌థ‌నాలు రావ‌డంతో వెద‌ర్ హీటెక్కింది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య ఎంట్రీ ఖ‌రారు కాలేదు. ఆయ‌న స్క్రిప్టు విని ఫైన‌ల్ చేసే వ‌ర‌కూ వేచి చూడాల్సిన ప‌రిస్థితి. తాజాగా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వాముల‌వ్వ‌డానికి మ‌రో రెండు అగ్ర సంస్థ‌లు కూడా ముందుకొస్తున్నాయి. సురేష్ ప్రొడక్ష‌న్స్ ఈ మూవీ నిర్మాణంలో పాలు పంచుకుంటోందిట‌. అలాగే హారికా-హాసిని క్రియేష‌న్స కూడా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి చూపిస్తోంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఒకేసారి ఇలా రెండు అగ్ర నిర్మాణ‌ సంస్థ‌లు ముందుకు రావ‌డంతో మీడియాలో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు అంత‌కంత‌కు హీట్ పెంచుతున్నాయి.

రానా పాన్ ఇండియా స్టార్. కానీ తెలుగు రాష్ట్రాల్లో అత‌ని యూనిక్ చిత్రాల‌కు క‌నెక్టివీటీ త‌క్కువ‌. హిందీ- త‌మిళ్- మ‌ల‌యాళ భాష‌లు స‌హా ఇత‌ర చోట్ల రానా క్రేజ్ బాగానే ఉంది. ఇక బాల‌య్య టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. మినిమం మార్కెట్ ఉన్న హీరో. స‌రైన కంటెంట్ ప‌డితే బాల‌య్య బాక్సాఫీస్ వ‌ద్ద రాణిస్తాడ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే బాలయ్య ఎంట్రీ కార‌ణంగా ఆ రెండు అగ్ర సంస్థ‌లు జాయిన‌య్యాయా? అన్న సందేహం ఫిలిం స‌ర్కిల్స్ లో వ్య‌క్త‌మ‌వుతోంది. అదే నిజ‌మైతే బాల‌య్య ఎంట్రీ కూడా నిజ‌మేన‌ని న‌మ్మాల్సిన స‌న్నివేశ‌మైతే ఉంది. మరి ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది అధికారికంగా వెల్ల‌డిస్తే కానీ తెలియ‌దు. రానా సినిమా కాబ‌ట్టి సురేష్ బాబు ఫింగ‌రింగ్ త‌ప్ప‌నిస‌రి. రానా-సురేష్ బాబు స్క్రిప్టును ఫైన‌ల్ చేసిన త‌ర్వాతే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్ర‌స్తుతం ఆ ఆ ఇద్ద‌రూ ఆ ప‌నిలో బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం.