Begin typing your search above and press return to search.

బాలయ్య మూవీకి జూనియర్ టైటిల్!?

By:  Tupaki Desk   |   5 July 2017 6:14 PM IST
బాలయ్య మూవీకి జూనియర్ టైటిల్!?
X
మన స్టార్ హీరోలు అందరూ.. టైటిల్ తోనే తమ సినిమా పవర్ ఏంటో చెప్పేందుకు ప్రయత్నించేస్తుంటారు. హీరో కేరక్టర్ ఎంతటి పవర్ఫుల్ అని చెప్పేందుకు టైటిల్స్ ను బేస్ చేసుకుంటారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో దమ్ము విడుదల అయిన తర్వాత.. ఆ మూవీలోని ఓ పాటలో వచ్చిన 'రూలర్' బాగా పాపులర్ అయింది.

పలువురు హీరోల తర్వాతి సినిమాలకు ఇదే టైటిల్ ని పరిశీలించారు కానీ.. కథలకు సెట్ కాకపోవడంతో ఈ పవర్ ఫుల్ టైటిల్ ఎవరూ ఉపయోగించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ టైటిల్ ను ఎన్టీఆర్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఉపయోగించే అవకాశాలున్నాయని టాలీవుడ్ అంతా విపరీతమైన టాక్ వినిపిస్తోంది. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాను ఖాయం చేసుకునే బాలయ్య.. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తో పైసా వసూల్ ను పూర్తి చేస్తూనే.. 102వ చిత్రాన్ని కూడా ఖాయం చేసేశారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఆగస్ట్ 2న బాలయ్య కొత్త సినిమా ప్రారంభం కానుండగా.. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 102వ చిత్రాన్ని నిర్మిస్తున్న సి కళ్యాణ్.. తన బ్యానర్ అయిన సీకే ఎంటర్టెయిన్మెంట్స్ పై రూలర్ టైటిల్ ను నిర్ణయించారని అంతా భావిస్తున్నారు. మరి ఈ గాసిప్ లో నిజానిజాల సంగతి ఇంకా తేలాల్సి ఉంది.