Begin typing your search above and press return to search.

అఫీషియల్ : బాలయ్య 105

By:  Tupaki Desk   |   10 Jun 2019 7:38 AM GMT
అఫీషియల్ : బాలయ్య 105
X
అనుమానాలు సందేహాలు అన్ని పటాపంచలు చేస్తూ నందమూరి బాలకృష్ణ 105కు రంగం సిద్ధమయ్యింది. ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా విష్ చేయడానికి నిర్మాత సి కళ్యాణ్ దర్శకుడు కెఎస్ రవికుమార్ వెళ్లడం వల్ల దీనికి క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఉన్న పోస్టర్ అఫీషియల్ గా ఇచ్చిందే అన్న స్పష్టత వచ్చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం నిరాశ కలిగించాక కొంత గ్యాప్ తీసుకున్న బాలయ్య బోయపాటి శీనుకు బదులు కెఎస్ రవికుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులకే కాదు మీడియాకు సైతం ఆశ్చర్యం కలిగించింది.

ఇది వినయ విధేయ రామ రిజల్ట్ చూశాక మారిన నిర్ణయమా లేక ఇంకేదైనా కారణమా తెలియదు కానీ మొత్తానికి తనకు జైసింహతో ఓ మాదిరి కమర్షియల్ హిట్ ఇచ్చాడన్న నమ్మకమే రవికుమార్ కు ఇంకో ఛాన్స్ వచ్చేలా చేసింది
షూటింగ్ ప్రారంభోత్సవం 13న జరిగే అవకాశాలు ఉన్నాయి . దీని కోసమే గెటప్ కూడా మార్చుకుని కొద్దిరోజులుగా బాగా గెడ్డం పెంచిన బాలయ్య ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి.

జగపతిబాబు విలన్ గా ఇప్పటికే కన్ఫర్మ్ కాగా హీరొయిన్స్ గా మేహ్రీన్ పాయల్ రాజ్ పుత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫస్ట్ డే నాడే ఖరారుగా తెలిసే ఛాన్స్ ఉంది. వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసిన రిలీజ్ ని మీట్ అయ్యేలా షూటింగ్ ని వేగంగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అసలు ఫాంలో లేని రవికుమార్ ని మళ్ళి దర్శకుడిగా ఎంచుకోవడంలో బాలయ్య స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు