Begin typing your search above and press return to search.

బాలయ్య-బోయపాటి.. అప్పుడు స్టార్ట్ చేస్తారు

By:  Tupaki Desk   |   22 May 2018 10:31 AM IST
బాలయ్య-బోయపాటి.. అప్పుడు స్టార్ట్ చేస్తారు
X
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే జనాల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన ఆసక్తి కనిపిస్తుంది. సింహ.. లెజెండ్ వంటి సక్సెస్ లు వీరి కాంబోలో రావడమే ఇందుకు కారణం. అయితే.. బాలయ్య 100వ సినిమా దగ్గర నుంచి.. బోయపాటి మూవీపై మాటలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాతో దసరా వరకు బిజీగానే గడపబోతున్నాడు ఈ దర్శకుడు. అయితే.. తన తర్వాతి చిత్రం మాత్రం బాలకృష్ణతోనే ఉంటుందని ఇప్పటికే ప్రకటించడంతో.. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ కలవగా., సినిమా లాంఛింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే.. ముహూర్తం షాట్ వరకూ మాత్రం తీసి.. ప్రాజెక్టును హోల్డ్ చేస్తారన్న మాట. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ ముహూర్తం షూట్ చేస్తే బాగుంటుందని.. ముహూర్తం నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది.

రాబోయే ఎన్నికల లోపు బోయపాటితో బాలకృష్ణ మూవీ చేయాల్సి ఉంది. జూన్ లో లాంఛింగ్ పూర్తి చేసి.. దసరా నాటికి పనులు ప్రారంభించి.. వచ్చే ఎలక్షన్స్ నాటికి సినిమాను తెరపైకి తేవాలని బోయపాటి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చెర్రీతో చేస్తున్న మూవీని ఫినిషింగ్ దశకు తెచ్చి.. బాలయ్యతో సినిమాకు సిద్ధం అవుతాడట బోయపాటి.