Begin typing your search above and press return to search.
హ్యాట్రిక్ కాంబోకి ముహూర్తం ఫిక్స్
By: Tupaki Desk | 7 Dec 2017 7:00 PM ISTనందమూరి బాలకృష్ణ అంటేనే సెన్సేషన్. వరుసగా సినిమాలు చేయడంలో కుర్ర హీరోలు కూడా ఈయన ముందు దిగదుడుపే. రీసెంట్ గా తన 101వ చిత్రం పైసా వసూల్ ని రిలీజ్ చేసి.. 102 వ సినిమా జైసింహా షూటింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు 104వ సినిమాను కూడా ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది.
సింహా.. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో తన 104వ చిత్రం చేయాలని నిర్ణయించేశారు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తాడని అన్నా.. మహేష్ దీనిని హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి అప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేయడం విశేషం. బాలయ్య పుట్టిన రోజు.. నందమూరి అభిమానులకు పండుగ రోజు అయిన జూన్ 10వ తేదీన ఈ హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం నిర్ణయించారని నందమూరి అభిమాన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. తన పుట్టిన రోజుకు ఆరు నెలల ముందే.. ఆరోజున ఇచ్చే గిఫ్ట్ ను చెప్పేశారు బాలకృష్ణ. అయితే.. బాలయ్య 103వ చిత్రం ఏదనే విషయంపై మాత్రం సస్పెన్స్ నెలకొనడం విశేషం.
రామ్ చరణ్ తో తన కొత్త సినిమా షూటింగ్ ను జనవరి చివరి వారం నుంచి ప్రారంభించనున్న బోయపాటి.. అది పూర్తి కాగానే బాలయ్య 104వ చిత్రంపై వర్క్ చేయనున్నాడు. మరోవైపు జూన్ లోగా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమాను అనౌన్స్ చేసి.. తన 103 చిత్రంగా బాలకృష్ణ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.